30 ఏళ్లు దాటినా కూడా అమ్మాయిలు పెళ్లి వద్దు అనడానికి కారణాలు ఏంటో తెలుసా..?

Ads

పెళ్లి అనేది నూరేళ్ళ పంట అని పెద్దలు చెప్పేవారు. అలాగే పెళ్లి అనేది ఎవరి లైఫ్ లో నైనా అతి ముఖ్యమైన భాగంగా చెప్పబడింది. ముఖ్యంగా పెళ్లి విషయంలో అమ్మాయిలు ఎన్నో కలలు కంటారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట అనవచ్చు. ప్రస్తుత కాలంలో అమ్మయిల ఆలోచన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొంత మంది వివాహం చేసుకుంటున్నా, కొంత మంది అమ్మాయిలు మాత్రం వయసు పెరుగు తున్నప్పటికి వివాహం గురించి ఆలోచించడంలేదు. మరి అమ్మయిలు ఎంత వయసు వచ్చినా పెళ్లి వద్దు అనుకోవడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గతంలో అమ్మాయిలు పెళ్లి కోసం ఎన్నో కలలు కంటూ ఉండేవారు. ఎలాంటి వ్యక్తి భర్తగా వస్తాడో అని, అత్తారింటి గురించి అక్కడి జీవితం గురించి ముందు నుండే ఆలోచిస్తూ ఉండేవారు. సమాజంలో అప్పటి పరిస్థితులు కూడా అలాగే ఉండేవి. కానీ రోజులు మారాయి. ఈ తరం అమ్మాయిలు కెరీర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా చదువును, స్కిల్స్ ను పెంచుకుంటూ తాము ఎంచుకున్న రంగంలో స్థిరపడే వరకు పెళ్లి అనే మాట గురించి ఆలోచించడం లేదు.

women prefer to work or to stay in home

Ads

అమ్మాయిలు 30 ఏళ్లు దాటినా, మంచి ఉద్యోగం, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి  జీవితంలో స్థిర పడిన తరువాత కూడా అమ్మాయిలు వివాహం గురించి ఆలోచించడం లేదు. చెప్పాలంటే సెలెబ్రెటీలు కూడా చాలా వరకు కెరీర్ లో విజయం సాధించినా, చాలా అందంగా ఉన్నప్పటికీ, చాలా డబ్బు ఇలా అన్ని చక్కగా ఉన్నప్పటికి వారు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా లైఫ్ ను కొనసాగిస్తుంటారు.

women prefer to work or to stay in home

ఇలా సెలెబ్రెటీలు మాత్రమే కాకుండా చాలామంది సక్సెస్ ఫుల్ గా జీవితాన్ని కొనసాగిస్తున్నవారు కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణాలను సైకాలజీ నిపుణులు ఇలా చెప్తున్నారు. పేరు, డబ్బు, పొజిషన్ వచ్చిన తరువాత కొన్ని అభద్రతల ఏర్పడుతాయని, ఒక వ్యక్తి తన పేరు, పొజిషన్ డబ్బును చూసి ఇష్టపడుతున్నాడా? తనను ఇష్టపడుతున్నాడా, ఇవన్నీ లేనప్పుడు కూడా ఇలానే తనను ప్రేమించగలడా?

అలా వచ్చినవారిని నమ్మవచ్చా అనే సందేహాల వల్ల పెళ్లి దూరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే వారి జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల కూడా ఒంటరిగా ఉండాలని భావిస్తారని చెబుతున్నారు. అలాగే తమకు సరిపోయే భాగస్వామి లభించకపోవడం వల్ల ఒంటరిగా ఉంటారని అంటున్నారు.

ALSO READ : ఈ 7 మంది డైరెక్టర్లకి ఈ 7 మంది హీరోయిన్లు చాలా ఫేవరెట్…వారి కాంబినేషన్ లో అన్ని హిట్లే.!

Previous articleనందమూరి బాలకృష్ణ పెళ్లి పత్రిక చూసారా..? ఏం రాసి ఉందంటే..?
Next article”కృష్ణుడి” తో జతగా రాధనే ఎందుకు పూజిస్తారు..? రుక్మిణిని ఎందుకు పూజించరు..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.