Ads
మనలో దాదాపు అందరూ ఎప్పుడో ఒకసారి అయినా పార్లే-జి బిస్కెట్స్ తినే ఉంటారు. ఈ బిస్కెట్లు చాలా సంవత్సరాల నుండి ఫేమస్. ఇక చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ బిస్కెట్స్ ని చాలా ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడైనా బిస్కెట్స్ కు ప్లార్లే-జీ అన్న పేరే ఎందుకు పెట్టారని, ఆ ప్యాకెట్ పై ఉన్న పాప ఎవరని గాని ఆలోచించారా? అయితే అవి చాలా మందికి తెలియని విషయాలే. ఇప్పుడు వాటి గూర్చి తెలుసుకుందాం.
Ads
అందరు ఇష్టంగా తినే బిస్కెట్స్ లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో పార్లే జి బిస్కెట్స్ తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ బిస్కెట్స్ ఎన్నో దశాబ్దాల నుండి అందరికి అందుబాటులో ఉన్నాయి. ఈ బిస్కెట్ల మొట్ట మొదటి ప్లాంట్ ను ముంబైలో విలే పార్లేలో మొదలు పెట్టారు. దాంతో ఆ బిస్కెట్లకి పార్లే జి అనేవారు. ఇక పార్లే జి లో ఉండే జికి అర్ధం గ్లూకోజ్. 1929లో పార్లే ఉత్పత్తులు తొలిసారిగా మొదలుపెట్టినప్పుడు ఆ ప్లాంట్ లో కేవలం పన్నెండు మంది పని చేసేవారు.ఇక 1938లో పార్లే బిస్కెట్స్ ను తయారి ప్రారంభించారు. అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్ కు మొదట్లో పార్లే గ్లూకో అని పేరు ఉండేది. నాలబై సంవత్సరాల తరువాత గ్లూకోను జిగా మార్చారు. ఇక పార్లే జి బిస్కెట్స్ బాగా పాపులర్ అవడంతో కంపెనీ జిని జీనియస్ గా మార్చింది. అలాగే ఈ పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ పైన కనిపిస్తున్న చిన్నారి ఎవరనే విషయం పై చాలా వార్తలు, అనేక వాదనలు వినిపించాయి.వీటిలో మూడు పేర్లు మాత్రం బలంగా వినిపించాయి. ఆ ముగ్గురు సుధా మూర్తి, నీరూ దేశ్‌పాండే, గుంజన్ గుండానియా. అయితే నీరు దేష్పాండే కు నాలుగు ఏళ్లు ఉన్నప్పుడు తీసిన ఫోటోనే పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ కి ఉపయోగించారని చాలా వార్తాపత్రికల్లో ఆమె పేరు బలంగా వినిపించింది. ఈ వార్తలు వైరల్ అవడంతో ఆ కంపెనీ ఈ ప్రచారాలన్నీటికి చెక్ పెడుతూ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న చిన్నారి ఫోటో కేవలం ఊహాగానం అని, ఎవరెస్టు క్రియేటివ్ ఏజెన్సీ ఈ ఫోటోను క్రియేట్ చేసారని తెలిపింది.
Also Read: కాఫీ,టీ తాగే ముందు నీళ్లు తాగితే ఏం అవుతుందంటే..?