ట్రోల్ అయిన తరువాత హిట్ అయినా దేవి శ్రీ 7 పాటలు ఏమిటో తెలుసా?

Ads

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీలోని బాస్ పార్టీ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబ్ నుండి ఇంస్టాగ్రామ్ రీల్స్ వరకు ఎక్కడ చూసిన ఈ పాట హవా కొనసాగుతోంది. కొద్ది రోజుల ముందు ఈ పాట ప్రోమో రిలీజ్ అయ్యింది. అప్పుడు ఈ పాటని బాగా ట్రోల్ చేసారు.

కానీ పూర్తి పాటను విడుదల చేశాక అంతా రివర్స్ అయ్యింది. అప్పుడు ట్రోల్ చేసినవారే, ప్రస్తుతం సూపర్ అంటూ, మంచి మాస్ పాట అనుకుంటూ ఈ సాంగ్ కి డాన్సులు వేస్తున్నారు. అయితే ఇది మొదటిసారి కాదు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలలో కొన్ని పాటలు మాత్రం ఇలాగే తిరస్కరించబడి, ఆ తరువాత హిట్ అయ్యి చాలా రోజుల వరకు ట్రెండింగ్ లో ఉండేవి. మరి అలాంటి కొన్ని పాటలు చూద్దాం..

Ads

#1. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 మూవీలోని ఈ సాంగ్ ని కూడా మొదట్లో చెత్త పాట అన్నారు. కానీ ఆ తరువాత మెగాస్టార్ స్టెప్స్ కి, దేవిశ్రీ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

#2.మైండ్ బ్లాక్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్ బ్లాక్ అనే మాస్ పాటను కూడా అస్సలు బాలేదని మొదట్లో అన్నారు. మూవీ రిలీజ్ అయ్యాక మాస్ హిట్ సాంగ్ గా నిలిచింది.

#3.హి ఐస్ సో క్యూట్
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలోని ‘హి హిజ్ సొ క్యూట్’ పాటను విన్నవారు దేవిశ్రీ పని అయిపోయినందని, ఇలాంటి పాట ఇచ్చాడేంటి అన్నారు. అయితే మూవీ రిలీజ్ సమయానికి ఈ సాంగ్ హిట్ గా నిలచింది.

#4.సామి సామి
ఈ సాంగ్ తెలుగులోనే కాకుండా దేశవ్యాపంగా ఒక ఊపు ఉపేసింది. అయితే మొదట్లో ఈ సాంగ్ ని మాకేంటి ఈ కర్మ సామి అంటూ బాగా ట్రోల్ చేసారు.

#5. ఊ అంటావా మావా..
ఈ పాత కూడా పుష్ప సినిమాలోనిదే. మొదట్లో ఈ పాట ఎవరికీ నచ్చలేదు. మూవీ విడుదల అయ్యాక అల్లు అర్జున్, సమంత స్టెప్స్ చూసాక ఈ పాత సూపర్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ తెలుగులో కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ హిట్ అనవచ్చు.

#6. బుల్లెట్టు
రామ్ పోతినేని హీరోగా వచ్చిన’ ది వారియర్’ సినిమాలోని బుల్లెట్టు సాంగ్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే కొన్ని రోజుల్లోనే సినిమా ప్లాప్ అయిన ఎక్కడ చూసిన ఇదే పాట వచ్చేది.

#7, బాస్ పార్టీ
దేవి కంపోజ్ చేసిన ఈ సాంగ్ వాల్తేరు వీరయ్య మూవీలోనిది. మొదట ఈ పాటను బాగా ట్రోల్ చేసారు. అయితే పాట మొత్తం విడుదలయిన తరువాత ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే ట్రెండింగ్ లో ఉంది.

Also Read: ప‌వ‌న్ స‌త్యాగ్ర‌హి సినిమా ఆగిపోవడానికి కారణం ఏమిటో తెలుసా?

Previous articleపార్లే జి బిస్కెట్ ప్యాకెట్ పై కనిపించే పాప ఎవరో తెలుసా?
Next articleషాపింగ్ మాల్స్ టాయిలెట్ల‌లో కింది భాగంలో ఖాళీగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.