Ads
సినిమాలు అంటే ప్రేక్షకులకు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. సినిమాలు అనేది ఒక ఎమోషన్. తరతరాల నుండి సినిమాలు ప్రేక్షకులలో నాటుకుపోయాయి. సినిమా వాళ్ళంటే కూడా ప్రేక్షకులకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. మన అనే ఒక అభిమానం ఉంటుంది. అలాంటి అభిమానం కేవలం సినిమా వాళ్లకి మాత్రమే సొంతం ఏమో. సినిమా వాళ్ళని సాధారణ ప్రజలు అంతగా ఆదరిస్తారు. అందుకే సినిమా వాళ్లు కూడా ప్రజల అభిమానం పొందడానికి కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు అంటే సోషల్ మీడియా వల్ల సినిమా కోసం అందుకు పనిచేసిన వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది తెలుస్తుంది.
Ads
కానీ అప్పట్లో కూడా సినిమాలకి ఇంకా ఎక్కువగా కష్టపడేవారు. అప్పుడు టెక్నాలజీ కూడా లేదు. కాబట్టి, ఏదైనా డిఫరెంట్ ఆలోచన ఉన్న సీన్ తీయాలి అంటే అందుకు ఏదో ఒక మార్గం వెతికి కష్టపడేవారు. ఈ ఫోటోలో ఉన్న వాళ్లు కూడా అలాగే ఒక సీన్ కోసం కష్టపడుతున్నారు. ఇందులో ఉన్న హీరో, హీరోయిన్లు మనందరికీ తెలిసిన వారే. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు. మూగమనసులు సినిమా సమయంలో పిక్చర్ ఇది. కానీ వీళ్ళతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా గొప్ప వ్యక్తులుగా పేరు పొందారు. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారి చేయి పట్టుకున్న వారు ఆదుర్తి గారు.
సావిత్రి గారి చీరను పట్టుకున్నది ఎవరో కాదు. కళాతపస్వి కె విశ్వనాథ్ గారు. గొప్ప నటుడిగా, అంతకంటే గొప్ప దర్శకుడిగా విశ్వనాథ్ గారు గుర్తింపు పొందారు. ఆయన సినిమాలని చాలా మంది దర్శకులు టెక్స్ట్ బుక్ లాగా భావిస్తారు. సీన్స్ అలా తీయాలి అని అనుకుంటారు. అంత బాగా తీసేవారు. ఇదే ఫోటోలో ఉన్న కెమెరామెన్ పేరు పి ఎల్ రాయ్ గారు. ఈ ఫోటోని కోరాలో వెంకటరమణ సూరంపూడి గారు షేర్ చేశారు. ఇందులో ఉన్నవాళ్లు ఎవరెవరు, ఈ సినిమా వర్కింగ్ స్టిల్ ఏ సినిమా లోనిది అని ప్రశ్నని వేశారు. ఇందుకు ప్రసాద్ గారు సమాధానం చెప్పారు.