Ads
దివంగత గాయకుడు,గాన గంధర్వుడు ఎస్పీబాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కానీ, ఇంకా ఆయన మన మధ్యే ఉన్నట్లుగానే అనిపిస్తుంటారు. ఎందుకంటే ఎస్పీబాలసుబ్రమణ్యం పాడిన పాటలు, ఆయన మాట్లాడిన మాటలు ఆడియెన్స్ కి గుర్తు చేస్తూనే ఉన్నాయి.
ఎక్కడో ఒక చోట రోజు ఆయన పాటలు వినిపిస్తూనే ఉంటాయి. గత ఏడాది సెప్టెంబర్ 25న ఎస్పీబాలసుబ్రమణ్యం కన్నుమూశారు. ఆయన తెర వెనుకే కాకుండా వెండితెర పై కూడా చాలా చిత్రాలలో నటించారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబం గురించి ఎక్కువ మందికి తెలియదు.ఎస్పీ బాలసుబ్రమణ్యం జూన్ 4న 1946లో ఉత్తర ఆర్కాడు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో సంప్రదాయ బ్రాహ్మణల ఇంటిలో జన్మించారు. ఆయన తండ్రి హరికథా కళాకారుడు. దాంతో బాలసుబ్రమణ్యంకు చిన్నతనం నుండి సంగీతం పట్ల ఆసక్తి ఉండేది. బాలసుబ్రమణ్యం మద్రాసులో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. బాలు కాలేజీలో జరిగే వేడుకల్లో స్టేజి పై పాటలు పాడేవారు. 1966లో వచ్చిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో బాలసుబ్రమణ్యం గాయకుడిగా పరిచయమయ్యారు. ఆయన ప్రతిభను చూసి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అప్పటి నుండి ఆయన వెను తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.ఆయన తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో కూడా పాటలు పాడారు. అంతేకాకుండా ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశారు. బాలసుబ్రమణ్యం వెండితెర పైనే కాకుండా బుల్లితెర పై కూడా రియాలిటీ షోలు చేశారు. బాలసుబ్రహ్మణ్యం పర్సనల్ విషయాలకి వస్తే ఆయన సతీమణి పేరు సావిత్రి. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు చరణ్ గాయకుడుగా అందరికి తెలుసు. కూతురి పేరు పల్లవి. బాలసుబ్రహ్మణ్యం సోదరి ఎస్.పి.శైలజ గాయని అన్న విషయం తెలిసిందే. శైలజ యాక్టర్ శుభలేఖ సుధాకర్ ను పెళ్లి చేసుకుంది.అయితే బాలసుబ్రహ్మణ్యం కుటుంబం గురించి వార్తలు బయటికి వచ్చేవి కాదు. అయితే ఇప్పటి వరకూ చూడని ఎస్పీబాలసుబ్రమణ్యం అరుదైన ఫోటోలను చూద్దాం..
Ads
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
Also Read: పవర్ స్టార్, నందమూరి బాలకృష్ణ మధ్యలో ఉన్న ఈ నటి ఎవరో తెలుసా?