పవర్ స్టార్, నందమూరి బాలకృష్ణ మధ్యలో ఉన్న ఈ నటి ఎవరో తెలుసా?

Ads

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్‌ షో కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఈ టాక్ షో ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ షోకు ఇప్పటివరకు పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. బాలకృష్ణతో తమ వ్యక్తిగత, కెరీర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఇటీవల ప్రసారమైన పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ ఎపిసోడ్ కు అనూహ్య రీతిలో రెస్పాన్స్‌ వచ్చింది.బాలయ్య షోలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. ఇక ఆడియెన్స్ ముందుకి రావడమే మిగిలింది. నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఒకే వేదిక పై కనిపించనుండడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఏపి రాజకీయాలు కూడా ప్రస్తుతం ఈ టాక్ షో చుట్టే తిరుగుతున్నాయి. బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు, వాటికి పవన్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారు.
సినిమాల గురించి మాత్రం మాట్లాడుకున్నారా? రాజకీయాల గురించి కూడా మాట్లాడరా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఏ ఎపిసోడ్ పై అంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఈ షో లో పవన్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, డైరెక్టర్ క్రిష్, హాజరు అయిన్నట్టు సమాచారం. అయితే ఈ టాక్ షో నుండి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ మధ్యలో ఒక మహిళ కనిపించారు. ఆ మహిళ ఎవరనే విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Ads

అయితే ఆమె సీనియర్ నటి జయమాలిని. ఇప్పటి తరానికి ఎక్కువగా తెలియదు కానీ, ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో ఆమె పేరు మారుమోగేది. ప్రతి సినిమాలోనూ ఆమె పాట ఉండేట్టు చూసుకునేవారు. ఆ పాటలను ఇప్పుడు ఐటమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ అని అంటున్నారు. కానీ, అప్పట్లో వీటిని క్లబ్ డాన్సులు, క్యాబరే డాన్సులు అనే వారు. అలాంటి పాటలతో నటి జయమాలిని బాగా పాపులర్ అయ్యింది. వ్యాంప్ పాత్రల్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని అప్పట్లో ప్రభంజనం సృష్టించారు. మరి ఆ నటిని నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తో ఎందుకు కలిశారు అనే చర్చ జరుగుతోంది.

Also Read:పూనకాలు లోడింగ్ పాటలో మెగాస్టార్ చిరంజీవి ధరించిన చొక్కాకి రామ్ చరణ్ కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

Previous articleడైరెక్టర్ శంకర్ సినిమాలో రామ్ చరణ్ చేయబోయే పాత్ర ఏమిటో తెలుసా?
Next articleనటుడు సుబ్బరాజు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.