Ads
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు, ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించిన కూడా ఆ సభల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సీఎం, సీఎం అనే నినాదాలు చేస్తూ ఉంటారు. చివరికి పవన్ కళ్యాణ్ వారించినా కూడా వాళ్ళు ఆపరు.
అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఆశించిన ఫలితాలను పొందలేకపోయింది. జనసేనాని వచ్చే ఎలక్షన్స్ పై గురి పెట్టాడు. వచ్చే ఎనికల్లో ఎలాగైనా తమ పార్టీని అధికారంలోకి తీసుకురావలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుని, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల జరిగిన పర్చూరు సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా తాము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు.అయితే ఇంతకు ముందు ఒకసారి పొత్తుల గురించి చెప్తూ తమకు మూడు ఆప్షన్లు ఉన్నాయని ప్రకటించారు. కానీ అలా ప్రకటించిన కొన్ని రోజులకే ఎందుకో మరి వెనక్కి తగ్గారు. జనసేన పార్టీ పొత్తు ఒక్క ప్రజలతోనే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అసలు పొత్తు ఉంటుందా లేదా అనే సందేహం అందరకి కలిగింది. జనసేన, బీజేపీ కలిసి ఎలక్షన్స్ పోటీ చేయబోతున్నాయా? లేదా జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేయబోతుందా అనే ఏపీ పాలిటిక్స్ లో చర్చకు దారి తీసింది.
ఇది ఇలా ఉండగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారని ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
Ads
ధరణిలో సిద్ధార్థి సంవత్సరంబున
తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ!
రాజవారసత్వము నశించినయ!
ప్రజారాజ్యము విలసిల్లునయ!
తప్పదు నా మాట నమ్మండయ!!ఇక జనసైనికులు తెలుగు సంవత్సరాల్లో సిద్ధార్థి అనే సంవత్సరం ఎప్పుడు వస్తుందనే విషయం కోసం వెతకడం మొదలుపెట్టారు. కొంతమంది 1919, 1979, 2029, 2099ల్లో సిద్ధార్థి నామ సంవత్సరం ఉందనే వికీపీడియా లింక్‌ను పోస్ట్ చేశారు. దాంతో వచ్చే ఎలక్షన్స్ జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాకపోతే 2029లో కచ్చితంగా అధికారం తమదేనని జనసైనికులు విశ్వసిస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ ప్రచార రథం “వారాహి” పేరుకి అర్ధం ఏమిటో తెలుసా?