Ads
ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో తీయడమే రీమేక్. అయితే ఈ పద్ధతి కొత్తగా వచ్చినది కాదు. 1950 ల నుండి రీమేక్ చేయడం అనేది ఉంది. అయితే అప్పట్లో నిర్మాతలు కన్నడ, మలయాళం భాషల్లో వచ్చిన చిత్రాలను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపించేవారు కాదు.
Ads
ప్రస్తుతం కన్నడ చిత్రాలు తెలుగులో విజయం సాధిస్తున్నాయి. అదే విధంగా మలయాళం మూవీస్ వరుసగా తెలుగులో రీమేక్ అయ్యాయి. ఇంకా రీమేక్ అవుబోతున్నాయి. ఇప్పటి వరకు తెలుగులో రీమేక్ చేసిన మలయాళం చిత్రాల్లో ఎన్ని సినిమాలు విజయం పొందాయని చూస్తే తక్కువ అనే చెప్పాలి. అయితే ఆ చిత్రాలు మంచి కంటెంట్ తో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అవి హిట్ కాలేకపోయాయి. తెలుగులో రీమేక్ అయిన మలయాళ చిత్రాలు ఏమిటో, ఆ సినిమాల ఫలితాలను ఏమిటో చూద్దాం..
1) ఫలక్ నుమా దాస్ :
‘అంగమలై డైరీస్’ అనే మూవీ రీమేక్ ఈ సినిమా. విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది.
2) ఎబిసిడి(2019) :
అల్లు శిరీష్ నటించిన ఈ సినిమా అదే పేరుతో వచ్చిన మలయాళం ‘ఎబిసిడి’ కి రీమేక్. ఇక్కడ విజయం సాధించలేదు.
3) ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య :
సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ మూవీ మలయాళం ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ మూవీకి రీమేక్. ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ను పొందింది. 4) ఇష్క్(2021) :
ఈ మూవీలో తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. మలయాళంలో అదే పేరుతో ఉన్న సినిమాకు రీమేక్. ఇక్కడ ప్లాప్ అయ్యింది.
5) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్, రానా కాంబోలో వచ్చిన ఈ సినిమా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కి రీమేక్. ఇక్కడ యావరేజ్ గా నిలిచింది.
6) శేఖర్ :
రాజశేఖర్ నటించిన ఈ సినిమా, మలయాళంలో వచ్చిన ‘జోసెఫ్’ కి రీమేక్. ఇక్కడ ప్లాప్ గా నిలిచింది.
7) దృశ్యం 2 :
వెంకటేష్ హీరోగా ‘దృశ్యం’ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ను పొందింది.
8) గాడ్ ఫాదర్ :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా, మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్. తెలుగులో విజయం పొందలేకపోయింది.
9) రాజు గారి గది 2 :
కింగ్ నాగార్జున, సమంత కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా మలయాళంలో వచ్చిన ‘ప్రేతమ్’ కి రీమేక్. యావరేజ్ గా నిలిచింది.
10) ప్రేమమ్ :
నాగ చైతన్య నటించిన ఈ సినిమా మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’ కి రీమేక్. ఇక్కడ ఈ సినిమా ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది.
Also Read:నటుడు సుబ్బరాజు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?