నటుడు సుబ్బరాజు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?

Ads

తెలుగు చిత్రపరిశ్రమలో విలక్షణ నటుల్లో సుబ్బరాజు ఒకరు. కృష్ణవంశీ డైరెక్షన్ లో రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ నటించిన చిత్రం ‘ఖడ్గం’. సుబ్బరాజు ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత చేసిన సినిమా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి.

Ads

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో అతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్టర్ సుబ్బరాజు తాను నటించిన తొలి రెండు చిత్రాలతోనే మంచి నటుడు అనిపించుకున్నాడు. అయితే అతనికి హీరోలను మించే కటౌట్ ఉన్నాకూడా, హీరో అనిపించుకునే చిత్రాలు చేయలేకపోయాడు. ఇక ఆ తర్వాత భద్ర, ఆర్య, పోకిరి, నేనింతే, పప్పు, గోల్కొండ హైస్కూల్, మిర్చి బాహుబలి 2, గీత గోవిందం లాంటి సినిమాలు సుబ్బరాజుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.సుబ్బరాజు వ్యక్తిగత విషయాలకి వస్తే, ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వ్యక్తి. సుబ్బరాజు తండ్రి రామకృష్ణంరాజు గారు భీమవరంలోని డిఎన్.ఆర్ కాలేజీలో లెక్చరర్ గా పని చేసేవారు. సుబ్బరాజు అదే కాలేజీలో చదువుకున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే నటుడు సుబ్బరాజుకి నలబై ఐదు సంవత్సరాలు. అంత వయసు వచ్చినా కూడా ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు.అసలు సుబ్బరాజు ఎందుకు ఇంకా వివాహం చేసుకోలేదనే అనుమానం అందరికి ఉంది. ఆ ప్రశ్నని ఆయన ముందుకు తీసుకెళ్లగా, అందుకు ఆయన ఇలా చెప్పుకొచ్చాడు. తనకు వివాహం అవసరం లేదని, వివాహం జరగడం వేరని, వివాహం చేసుకోవడం వేరు. వివాహం జరగడం అనేది పెద్దవాళ్ళ బలవంతం మీదే ఆధారపడి ఉంటుందని, పెద్దవాళ్ళ ఆనందం కోసం తాను వివాహం చేసుకుని, ఇబ్బంది పడలేనని, పెళ్ళి చేసుకోవాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను అని తెలియచేసారు.

Also Read: పూనకాలు లోడింగ్ పాటలో మెగాస్టార్ చిరంజీవి ధరించిన చొక్కాకి రామ్ చరణ్ కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

Previous articleపవర్ స్టార్, నందమూరి బాలకృష్ణ మధ్యలో ఉన్న ఈ నటి ఎవరో తెలుసా?
Next articleఅన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ధరించిన హుడీ ధర ఎంతో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.