Ads
జగపతి బాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించాడు. టాలీవుడ్ లో శోభన్ బాబు తర్వాత జగపతి బాబు అనేలా ఎదిగాడు. అయితే 2007 వరకు జగపతి బాబు హీరోగా చేసినా, ఆ తరువాత కొత్తగా వచ్చిన హీరోలతో పోటీ పడలేకపోవడంతో హీరోగా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇంకోవైపు ఆయన వ్యసనాల వల్ల కోట్ల ఆస్తిని కూడా కోల్పోయారు. అటువంటి సమయంలో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ మూవీతో విలన్ గా మారారు.
Ads
ఈ చిత్రంలో జగపతి బాబు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా కూడా విజయం పొందడంతో జగపతి బాబుకి వరుస నెగిటివ్ రోల్స్ వచ్చాయి. విలన్ పాత్రలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఒక వైపు విలన్ పాత్రలు చేస్తూనే, ఇంకో వైపు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నారు. జగపతి బాబు సినిమా జీవితాన్ని పక్కన పెడితే, వ్యక్తిగతంగా ఆయనకు నచ్చినట్టు ఉంటారు. అలాగే తనకు నచ్చినట్టు మాట్లాడుతాడానే విషయం అందరికీ తెలిసిందే.అయితే జగపతి బాబు పెద్ద కూతురు ఒక విదేశీయుడిని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. జగపతి బాబు పెద్ద కుమార్తె మేఘన అమెరికన్ అయిన చాక్ బూవెన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక జగపతి బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. పరిశ్రమలో ఆయన కుటుంబానికి పెద్ద పేరు ఉంది. జగపతి బాబు తలచుకుంటే గొప్ప ఫ్యామిలిని నుండి అల్లుడిని తీసుకురాగలరు.జగపతి బాబు ఒక విదేశీయుడిని ఇంటి అల్లుడిగా చేసుకోవడాన్ని ఆయన బంధువులు అప్పట్లో బాగా వ్యతిరేకించారు. జగపతి బాబు కూతురు మేఘన అమెరికాలో పీజీ చదువుతున్నప్పుడు బూవెన్ ను ప్రేమించిందంట. తన ప్రేమ గురించి జగపతి బాబుకు చెప్పగానే, ఆయన 20 సంవత్సరాల తరువాత కూడా ఇలాగే కలిసుండగలరని అనుకుంటారా? అని ప్రశ్నించారట. దానికి మేఘన కాన్ఫిడెంట్ గా అవును అని చెప్పిందంట. దాంతో తన కూతురి సంతోషమే ముఖ్యమని జగపతి బాబు ఒక విదేశీయుడిని అల్లుడిగా చేసుకున్నారు.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి సందడి హీరోయిన్.