అక్కినేని కటుంబంలోని వారి పేర్ల‌కు ముందు ‘నాగ’ అని ఉండడానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా?

Ads

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు అక్కినేని కుటుంబం గురించి ఆ కుటుంబానికి ఉన్న స్పెషాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Ads

ఎన్నో అద్భుత‌మైన సినిమాలలో న‌టించిన అక్కినేని నాగేశ్వ‌ర్ రావు గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎన్నో విభిన్న సినిమాలలో న‌టించి తెలుగులో గొప్ప న‌టుడిగా నిలిచారు. త‌నదైన న‌ట‌న‌తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు.ఆయ‌న వారసుడిగా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున అగ్రనటుడిగా కొనసాగుతున్నారు. నాగార్జున విక్ర‌మ్ చిత్రంతో పరిచయం అయ్యారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన శివ సినిమాతో అక్కినేని నాగార్జున కెరీర్ మారిపోయింది. ఆ సినిమా త‌రువాత ఆయ‌న వెన‌క్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
నాగార్జున త‌రువాత ఆయ‌న కుమారులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ సినీ ఇండ‌స్ట్రీలోకి ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు ప్ర‌స్తుతం రాణిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఒక విషయంలో వారి అభిమానుల‌కు ఎన్నోఏళ్ల నుండి ఒక సందేహం ఉంది. అది ఏమిటంటే అక్కినేని కుటుంబంలో ఎక్కువ మందికి వారి పేర్ల‌ ముందు నాగ అని ఉంటుంది. అలా ఎందుకు అనే విషయం అభిమానులలో చాలా మంది మెదళ్ళను తొలుస్తోంది. కాగా నాగార్జున ఈ విషయం పై గ‌తంలోనే ఒకసారి వివరణ ఇచ్చారు. త‌మ కుటుంబంలోని అంద‌రి పేర్ల‌లో ముందుగా నాగ అని ఎందుకు ఉంటుందో చెప్పారు. అయితే దీనికి బ‌ల‌మైన కార‌ణం ఏమిటో చూద్దాం.అక్కినేని నాగేశ్వరరావు క‌డుపులో ఉన్న సమయంలో ఆయ‌న త‌ల్లికి తరచుగా పాములు క‌ల‌లో క‌నిపించటంతో, ఆమె భ‌య‌ప‌డి కుమారుడికి నాగేశ్వరరావు అని పేరు పెట్టరంట. ఆ తరువాత కూడా ఆమెకు పాములు క‌నిపించేవంట. దీంతో నాగేశ్వరరావు తల్లి నాగ‌దేవ‌త‌కు త‌ర‌చూ ప్ర‌త్యేకంగా పూజ‌లు చేసేవారంట. అంతేకాకుండా త‌మ ఫ్యామిలిలో పుట్టేవారికి నాగ అని వ‌చ్చేలా పేరు పెట్టాల‌ని చెప్పింద‌ట‌. అందుకే నాగేశ్వ‌ర్ రావు త‌న కొడుకుకు నాగార్జున‌కు అని పేరు పెట్టారు. ఆ త‌రువాత నాగార్జున తన పెద్ద కొడుకుకు నాగ‌చైత‌న్య పేరు పెట్టారు. ఎందుకంటే తొలి సంతానానికి మాత్ర‌మే అలా పెట్టాల‌ని నాగేశ్వరరావు తల్లి చెప్పార‌ట‌. ఇక ఈ విష‌యాన్ని స్వ‌యంగా నాగార్జున ఒక సందర్భంలో తెలియ‌జేశారు.

Also Read: జక్కన్న అతిధి పాత్రలో నటించిన 6 సినిమాలు ఏమిటో తెలుసా?

Previous articleబంధువులకు వ్యతిరేకంగా జగపతి బాబు విదేశీయుడిని ఎందుకు తన అల్లుడిగా చేసుకున్నారో తెలుసా?
Next articleరజినీకాంత్ మాస్ మాఫియా షురూ…ఇరగదీస్తున్న జైలర్ చిత్రం.
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.