అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు..

Ads

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. కరోనా లాక్ డౌన్ నుండి ఆడియెన్స్ ఓటీటీలకు అలవాటు పడ్డారని చెప్పవచ్చు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చూడడం మొదలుపెట్టారు. కంటెంట్ విభిన్నంగా ఉండడంతో తెలుగు కాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి చూశారు.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లు తెలుగులో కూడా ఎక్కువగా రూపొందిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా హిందీలో చేసిన వెబ్ సిరీస్ లను తెలుగు,మలయాళం, తమిళం లాంటి వేరే భాషలలోకి డబ్ చేసి, అందిస్తోంది. మరి గత ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన టాప్ 10 తెలుగు వెబ్ సిరీస్‌ లు ఏమిటో చూద్దాం..
1.బ్రీత్
ఇది ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో హీరో ఆర్ మాధవన్, అమిత్ సాధ్,విశ్వకర్మ, అథర్వ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ 2018లో అమెజాన్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది. ఊపిరి 2017 అమెజాన్ ప్రైమ్ సెకండ్ ఇండియన్ ఒరిజినల్ సిరీస్. అత్యధిక రేటింగ్ పొందిన తెలుగు వెబ్ సిరీస్.ఇది IMDBలో 8.3/10 రేటింగ్‌ను కలిగి ఉంది. బ్రీత్ యొక్క రెండు సీజన్లలో 20 ఎపిసోడ్‌లు ఉన్నాయి.
2.ది ఫ్యామిలీ మ్యాన్2
ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో అత్యధికంగా వ్యూస్ పొందిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఈ సిరీస్ కి కృష్ణ DK, రాజ్ నిడిమోరు డైరెక్షన్ చేశారు. దీనిలో మనోజ్ బాజ్‌పేయి, హీరోయిన్ సమంత, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఏ వెబ్ సిరీస్ రెండు సీజన్‌లు IMDBలో 9.3/10 రేటింగ్‌ను పొందాయి. రెండు సీజన్లలో కలిపి 19 ఎపిసోడ్‌లు ఉన్నాయి.
3.మీర్జాపూర్
మీర్జాపూర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అత్యధికంగా వ్యూస్ పొందిన వాటిలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్‌లో బెస్ట్ వెబ్ సిరీస్ గా చెప్పవచ్చు. రెండు సీజన్లలో 19 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, విక్రాంత్ మాస్సే, అలీ ఫైజల్ ముఖ్య పాత్రల్లో నటించారు.
4.ది లాస్ట్ అవర్
ఇది అమెజాన్ ప్రైమ్ లో సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్ లో మైఖేల్ పారే, షానన్ ట్వీడ్, బాబీ డి సిక్కో నటించారు. దీనిని అమిత్ కుమార్, అనుపమ మింజ్ నిర్మించారు. విలియం సాచ్స్ డైరెక్షన్ చేశారు. ఈ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ IMDBలో 7.2/10 రేటింగ్‌ను పొందింది.

Ads

5.బండిష్ బందిపోట్లు
అమృతపాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఇండియన్ మ్యూజికల్ డ్రామాతో తెరకెక్కింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో మరో బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ అనవచ్చు. శాస్త్రీయ సంగీత విద్వాంసురాలుగా రిత్విక్ భౌమిక్, పాప్ గాయనిగా శ్రేయా చౌదరి నటించారు. ఈ సిరీస్ IMDBలో 8.7/10 రేటింగ్‌ను పొందింది.6.ది వీల్ ఆఫ్ టైమ్
ఈ సిరీస్ రాబర్ట్ జోర్డాన్ రాసిన బుక్ “ది వీల్ ఆఫ్ టైమ్” ఆధారంగా తెరకెక్కింది. ఇది ఒక అమెరికన్ ఫాంటసీ సిరీస్. ది వీల్ ఆఫ్ టైమ్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ సిరీస్ IMDBలో 7.5/10 రేటింగ్‌ను పొందింది.
7.ది ఫర్గాటెన్ ఆర్మీ
ఈ సిరీస్ 2020లో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అయిన సిరీస్. దీనికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు IMDBలో 7.9/10 రేటింగ్ ఉంది.
8.గ్యాంగ్‌స్టార్స్
ఈ వెబ్ సిరీస్ 2018లో రిలీజ్ అయినా, ఇప్పటికీ కూడా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రైమ్ డ్రామా అమెజాన్ ప్రైమ్‌లో బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ లలో ఒకటి. ఇందులో జపతిబాబు, సిద్దూ జొన్నలగడ్డ, నవదీప్, శ్వేతా బసు ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ వెబ్ సిరీస్ 6.8 రేటింగ్‌ను పొందింది.9.మేడ్ ఇన్ హెవెన్
ఈ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆడియెన్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. దీనిని జోయా అక్తర్, అలంకృత శ్రీవాస్తవ రచించారు. ఇందులో శోబితా దూలిపాలా, అర్జున్ మాథుర్, జిమ్ సర్భ్ ప్రధాన పాత్రలలో నటించారు, ఈ సిరీస్ IMDBలో 8.3/10 రేటింగ్‌ను పొందింది.
10.పాతల్ లోక్
ఈ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఈ డార్క్ థ్రిల్లర్ మొదటి సీజన్ తొమ్మిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ IMDbలో 8.0/10 రేటింగ్‌ను పొందింది.
Also Read: మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సెన్సార్ టాక్.. మెగా మాస్ జాతర..!

Previous articleఅప్పటి స్టార్ హీరోలలో పారితోషికం ఎవరు ఎక్కువ తీసుకునేవారో తెలుసా?
Next articleబంధువులకు వ్యతిరేకంగా జగపతి బాబు విదేశీయుడిని ఎందుకు తన అల్లుడిగా చేసుకున్నారో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.