Ads
రామానాయుడు గురించి మనం పరిచయం చేయక్కర్లేదు. రామానాయుడు గురించి అందరికీ తెలుసు. సినిమాలంటే రామానాయుడు కి ఎంతో ఇష్టం. సినిమాలో ఇష్టం వల్లనే పిల్లలు పుట్టగానే చెన్నై వెళ్ళిపోయి అక్కడే సినిమా నిర్మాణాన్ని మొదలుపెట్టారు రామానాయుడు. రామానాయుడు తర్వాత సురేష్ బాబు నిర్మాతగా పని చేయడం మొదలుపెట్టాడు.
సురేష్ బాబు నిర్మాతగా స్థిరపడ్డాడు. అలానే వెంకటేష్ కూడా ఇండస్ట్రీ లోనే స్థిరపడ్డాడు. ఇక మనవలు కూడా ఆయన లెగసిని కంటిన్యూ చేస్తున్నారు. రానా, అభిరామ్ కూడా ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు.
అయితే విక్టరీ వెంకటేష్ ని చూస్తే నటుడుగా రాణిస్తున్నాడు. సురేష్ బాబు అయితే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే చాలా మందిలో ఉండే అనుమానం ఏమిటంటే వెంకటేష్ హీరోగా ఉన్నాడు. సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు కారణం ఏమిటి ఎందుకు ఒకరు ఇలా ఒకరు అలా అని… ఈ విషయాన్ని స్వయంగా రామా నాయుడే షేర్ చేసుకున్నారు. బాలయ్య అన్ స్టాప్ ఫుల్ షో లో ఈ విషయాన్ని సురేష్ బాబు చెప్పారు. ఒకరిని సినిమా తీయమని.. ఒకరిని సినిమా చేయమని ఎందుకు రామనాయుడు చెప్పారు అనేది చూస్తే.. నిజానికి ప్రొడక్షన్ చేయాలంటే అన్ని విభాగాల్లోనూ నాలెడ్జ్ ఉండాలి. డబ్బులు సరిగ్గా ఖర్చు చేయగలగాలి. దానితో పాటుగా సినిమా థియేటర్లను కూడా హోల్డ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చెయ్యడానికి తెలివి ఉండాలి.
Ads
సురేష్ బాబుకు తెలివితేటలు ఎక్కువ. ఈ కారణం గానే నిర్మాతగా సురేష్ బాబు వ్యవహరించాలని వెంకటేష్ కాస్త అమాయకుడు కనుక హీరోగా ఉంటే మంచిదని రామా నాయుడు అనుకున్నారట. పైగా వెంకటేష్ చాలా అమాయకుడు అవడంతో ఎవరినైనా ఈజీగా నమ్మి మోస పోతారని హీరోగా చేశారు. పైగా మనిషి ఎత్తు, పర్సనాలిటీ కూడా వెంకటేష్ కి ఉంది కనుక హీరోగా ఎదుగుతాడని రామానాయుడు కి నమ్మకం ఉందిట. రామానాయుడు చేసిన క్యాలిక్యులేషన్స్ లో ఎటువంటి తప్పు లేదు అని మనం ఇప్పుడు చూస్తేనే తెలుస్తోంది.
Also Read: సినిమాలకి బాలయ్య కూతుర్లు దూరంగా ఉండడానికి కారణం ఇదేనా..?