Ads
సినీ రంగం అనేది ఒక రంగుల ప్రపంచం. వెండి తెర మీద తమను తాము చూసుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఆ కోరికను తీర్చుకోవడమే కాకుండా స్టార్స్ గా రాణించిన వారు ఉన్నారు.
సాధారణంగా అయితే ఇండస్ట్రీలో రాణించిన తరువాత ఎక్కువ మంది రాజకీయాలలో అడుగు పెడతారు. కొంతమంది వ్యాపార రంగంలోకి వెళతారు. కానీ కొందరు సినీ పరిశ్రమలో సక్సెస్ అయిన తరువాత ఆధ్యాత్మికత వైపు వెళ్ళి సన్యాసం తీసుకున్నారు. అలా బాలీవుడ్ లో 5 గురు స్టార్స్ సినిమాలకి హఠాత్తుగా వీడ్కోలు చెప్పి సన్యాసంలో కలిశారు. కెరీర్ పీక్స్ లో ఉండగా అలా సన్యాసం తీసుకున్న ఆ స్టార్స్ ఎవరో చూద్దాం..సోఫియా హయత్ :
హిందీ బిగ్ బాస్ సీజన్ 7 సోఫియా హయాత్ పాల్గొని ప్రేక్షకులకు చేరువ అయ్యింది. సోఫియా బ్రిటిష్ మోడల్ గా, సింగర్ గా, యాక్టర్ గా కూడా మంచి గుర్తింపును పొందారు. సడెన్ గా ఒకరోజు సన్యాసిగా మారింది.బర్ఖా మదన్ :
తనదైన నటనతో అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించింది. అయితే బర్ఖా మదన్ అనతికాలంలోనే ఇండస్ట్రీకి వీడ్కోలు చెప్పి, దలైలామా స్పూర్తితో బుద్ధీజం తీసుకొని సన్యాసినిగా మారిపోయింది. ఆ తరువాత తన పేరుని వెన్ గ్యాంటన్ గా మార్చుకుంది.
అను అగర్వాల్ :
ఢిల్లీ నుండి బాలీవుడ్ కి వచ్చిన అను అగర్వాల్ అతి తక్కువ సమయంలోనే ఇంటర్నేషనల్ మోడల్ గా ఎదిగింది. తన మొదటి సినిమా ‘ఆషికి’తోనే స్టార్ గా మారింది. అయితే ఆమె 1997 లో అన్నిటిని వదిలి, ఉత్తరాఖండ్ లోని యోగా ఆశ్రమంలో సన్యాసినిగా చేరింది. తాను యోగా ఆశ్రమంలో చేరడం వల్లనే నిజమైన సంతోషాన్ని,సంతృప్తిని పొందుతున్నాని ఆమె తెలిపింది.మమతా కులకర్ణి :
1990ల యువత కలల రాణిగా పేరు గాంచిన మమతా కులకర్ణి, చాలా హిందీ సూపర్ హిట్ సినిమాలతో ఆడియెన్స్ ని అలరించారు. తరువాత సడెన్ గా సన్యాసినిగా మారారు. ఆ తరువాత తన ఆటోబయోగ్రఫీ బుక్ ని రాసింది. ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగిని అనే పేరిట ఆ బుక్ ని విడుదల చేశారు.
Ads
వినోద్ ఖన్నా :
1970,80 దశకాలలో బాలీవుడ్ అందమైన హీరోలలో వినోద్ ఖన్నా ఒకరు. స్టార్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన ఆయన ఓషో శిష్యునిగా చేరి, ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేశారు. ఆ తరువాత సినీ రంగాన్ని వదిలి స్వామి వినోద భారతిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళి, కుటుంబాన్ని సరిగ్గా చూడలేకపోయారు. దాంతో ఆయన మొదటి భార్య గీతాంజలి విడాకులు తీసుకున్నారు.
Also Read: ఈ 6 విలన్స్ రెమ్యూనరేషన్ ఎంతో మీకు తెలుసా..?