Ads
సాధారణంగా టీచర్ల నుండి పోలీసుల వరకు కూడా ఎవరెవరికి ఎంత జీతం వస్తుంది అన్న దానిమీద అంతో ఇంతో అవగాహన అందరికి ఉంటుంది. కానీ దేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులకు ఎంత జీతం ఉంటుంది?
Ads
అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కువ జీతం? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి తక్కువ జీతం ఉంటుంది అనే వివరాలు చాలావరకు ఎక్కువ మందికి తెలియదు. అయితే ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఆసక్తి అందరికీ ఉంటుంది. కానీ వీటి గురించి తెలియదు. మరి ముఖ్యమంత్రులలో ఎక్కువ జీతం ఎవరు తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
ఇక మన దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే. తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యధిక జీతం పొందుతున్న ముఖ్యమంత్రిల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయనకు నెలకు రూ.4.10 లక్షల వేతనం వస్తోంది. దీనితో పాటుగా హౌస్ అలవెన్స్, అంతరాష్ట్ర ప్రయాణ ఖర్చులు, టెలిఫోన్ బిల్లుల వంటి అలవెన్సులు అదనంగా ఉంటాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండవ స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎంకు నెలకు రూ. 4 లక్షల జీతం వస్తుంది. ఇతర అలవెన్సులు కూడా వస్తాయి. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఆయనకు నెలకు 3 లక్షల 65 వేల రూపాయల వేతనం వస్తుంది. దీనితో పాటు ఇతర అలవెన్సులు కూడా వస్తాయి. ఈ జాబితాలో ఆయన నాలుగో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఏక్ నాథ్ షిండే ఉన్నారు. ఆయనకు 3 లక్షల 40 వేల రూపాయల వేతనం వస్తుంది. ఇతర అలవెన్సులు వస్తాయి.గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నెలకు 3 లక్షల 21 వేల రూపాయల వేతనం వస్తుంది. దీనితో పాటు ఇతర అలవెన్సులు కూడా వస్తాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ నెలకు 3 లక్షల 10వేల రూపాయల జీతం వస్తుంది. దీనితో పాటు ఇతర అలవెన్సులు వస్తాయి. హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ నెలకు రెండు లక్షల 88 వేల రూపాయలను వేతనం తీసుకుంటున్నారు. దీనితో పాటు ఇతర అలవెన్సులు కూడా వస్తాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు 2 లక్షల 72 వేల రూపాయలు, దీనితో పాటు ఇతర అలవెన్సులు కూడా వస్తాయి.మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ నెలకు 2 లక్షల 55 వేల రూపాయలను జీతం. ఇతర అలవెన్సులు కూడా వస్తాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ నెలకు 2 లక్షల 15 వేల రూపాయలను వేతనం తీసుకుంటున్నారు. ఇతర అలవెన్స్ లు ఉంటాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 2 లక్షల 10వేల రూపాయలను వేతనం పొందుతున్నారు. ఇతర అలవెన్సులు ఉంటాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ 2 లక్షల 5వేల రూపాయలను వేతనం పొందుతున్నారు. ఇతర అలవెన్సులు ఉంటాయి.ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేవలం రూపాయి మాత్రమే వేతనంగా తీసుకుంటున్నారు. అయితే నిజానికి ఆంధ్రప్రదేశ్ సీఎంకి రెండున్నర లక్షలు జీతం ఉంటుంది. సీఎం జగన్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న కారణంగా కేవలం ఒక రూపాయి మాత్రమే తీసుకుంటున్నారు.
Also Read: ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని చంద్రబాబు నాయుడు అరుదైన ఫోటోలు..