సొంత మరదళ్ళని పెళ్లి చేసుకున్న.. 6 హీరోలు వీళ్ళే..!

Ads

ఎక్కువమంది సెలబ్రిటీలు సెలబ్రిటీలనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఎప్పటి నుండో ఇలానే జరుగుతోంది. కొంత మంది మాత్రం వ్యాపారవేత్తలను చేసుకుంటూ ఉంటారు. అలానే మరి కొందరు వారి బావని లేదా మరదలిని పెళ్లి చేసుకుంటారు.

ఈ సెలబ్రిటీలు వారి సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకున్నారు. మరి సొంత మరదలని పెళ్లి చేసుకున్న హీరోలు గురించి ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు నుండి ఆది, కార్తీ వరకు చాలా మంది నటులు వారి సొంత మరదళ్లనే పెళ్లి చేసుకున్నారు.

#1. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ:

అక్కినేని నాగేశ్వరావు సొంత మరదలు అయినా అన్నపూర్ణని వివాహం చేసుకున్నారు. వీళ్ళ వివాహం 1949లో అయింది. అప్పటికి ఏఎన్ఆర్ గారు 10 సినిమాల వరకు నటించారు.

#2. ఎన్టీఆర్, బసవతారకం:

ఎన్టీఆర్, బసవతారకం కూడా మేనమామ పిల్లలే. మరదలైన బసవతారకం ని ఎన్టీఆర్ గారు 1942లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అప్పటికి ఎన్టీఆర్ ఇంకా సినిమాల్లోకి రాలేదు. పెళ్లి తరవాతనే ఎన్టీఆర్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.

Ads

#3. కృష్ణ, ఇందిరా దేవి:

కృష్ణ ఇందిరా దేవి 1961 లో పెళ్లి చేసుకున్నారు. అయితే కృష్ణ గారు అప్పటికి సినిమాల్లోకి రాలేదు. వీళ్ళు కూడా బావ మరదళ్ళు. పెళ్లి అయినా నాలుగేళ్లకి కృష్ణ గారు సినిమాల్లోకి వచ్చారు.

#4. ఆది, అరుణ:

సాయికుమార్ కొడుకు ఆది కూడా సొంత మరదలు అయిన అరుణ ని పెళ్లి చేసుకున్నాడు. 2014లో తన మరదలు అరుణతో ఏడడుగులు వేశారు.

#5. కార్తీ, రజిని:

సొంత మరదలని కార్తీ కూడా పెళ్లి చేసుకున్నారు. 2011లో వీళ్ళ వివాహం అయింది.

#6. మోహన్ బాబు, విద్యా దేవి నిర్మల దేవి:

మోహన్ బాబు తన మరదలు విద్యాదేవిని వివాహం చేసుకున్నారు కానీ ఆమె చనిపోయిన తర్వాత విద్యా దేవి సొంత చెల్లి అయిన నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు.

Also Read: సొంత జెట్ విమానాలున్న టాలీవుడ్ హీరోలు వీరే..!

Previous article“చెవులు, కళ్ళు, నోరు పనిచేయని అమ్మాయిని ముట్టుకోకుండా ఎలా ప్రపోజ్ చేస్తావు..?” అనే IAS ప్రశ్నకు… ఈ యువకుడు చెప్పిన సమాధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Next articleపెళ్లి కోసమని జిమ్ కి వెళ్లడం మొదలెట్టారా.? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..లేదంటే.?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.