Ads
ఎన్టీ రామారావు గారు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్టీ రామారావు గారు చాలా సినిమాల్లో నటించారు. పైగా ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు. నిజానికి ఆయనకి ఆయనే సాటి ఆయనకి ఆయనే పోటీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ చాలా ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. పైగా సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది.
తెలుగు భాష మీద కూడా ఎన్టీ రామారావు గారికి మంచి పట్టు ఉంది. అయితే నటనలోనే ఎన్టీఆర్ ముందు ఉన్నారు అనుకుంటే పొరపాటు. చదువులో కూడా ఆయన ముందే ఉండేవారు.
మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆయనకు ఏడవ ర్యాంకు వచ్చింది. 1100 మంది ఆ పరీక్షను రాస్తే ఆయనకి ఏడవ ర్యాంకు రావడం అనేది ఎంతో గొప్ప విషయం ఆ తర్వాత ఆయన మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగాన్ని పొందారు. పైగా చిత్రలేఖనంలో కూడా ఆయనకి ఎన్నో బహుమతులు వచ్చాయి. ఎన్టీ రామారావు గారి చేతి రాత చాలా అందంగా ఉంటుంది. అక్షరాలు ముత్యాల్లా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఆయన చేతిరాత విపరీతంగా వైరల్ అవుతోంది. నిజంగా అక్షరాలు చూస్తుంటే ముత్యాలు లాగే ఉన్నాయి.
Ads
‘విజయ్ చిత్ర’ అనే పత్రిక ద్వారా ఆయన పాఠకులకి రాసిన లేక ఇది. ఈ లేఖలో ఆయన సొంత చేతి వ్రాత ని మనం చూడొచ్చు. మూడు పేజీల లేఖని షూటింగ్ మధ్యలో వుండే బ్రేక్ సమయంలో ఆయన వ్రాసారట. చూడడానికి ఏదో ప్రింట్ అన్నట్టు ఉంది. చేతి వ్రాత అంటే ఎవరూ నమ్మరు. తనకి సినిమా ఇండస్ట్రీలో లభించిన ఆదరణ గురించి ఈ లేఖ లో రాశారు అలానే అవకాశాలు ఇచ్చిన నిర్మాతల గురించి కూడా రాశారు. తన సినిమా సక్సెస్ అయినందుకు ధన్యవాదములు కూడా చెప్పారు ఎన్టీఆర్ గారు. కేవలం ఆయన గురించి మాత్రమే కాకుండా పనిచేసిన వారి గురించి కూడా రాశారు.
Also Read: త్రివిక్రమ్-సునీల్ రియల్ లైఫ్ లో ఇద్దరి మధ్య ఉన్న ఈ కో-ఇన్సిడెన్స్ ఎంత మందికి తెలుసు ?