తండ్రి, అన్న లేకుండానే బాలకృష్ణ పెళ్లి జరిగిందా..? కారణం ఏంటంటే..?

Ads

ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ తో పాటు బాలయ్య కొన్ని సినిమాల్లో నటించారు. బాలకృష్ణ సోలో హీరోగా పెళ్లి వరకు నటించలేదు. పెళ్లి తర్వాత మాత్రమే సోలో హీరోగా నటించారు బాలకృష్ణ. అప్పటికి కేవలం తన తండ్రితో పాటే సినిమాల్లో నటించారు. తాతమ్మ కల తో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. అన్నదమ్ముల అనుబంధం సినిమాతో పాపులర్ అయ్యారు బాలకృష్ణ. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది.

బాలకృష్ణకి వసుంధర దేవి తో పెళ్లి అయిన విషయం అందరికీ తెలుసు. కానీ బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ రాలేదు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇది విని మీరు కూడా షాక్ అవుతున్నారు కదా.. అవును బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ రాలేదు.

బాలయ్యతో వసుంధర దేవి పెళ్లి చాలా విచిత్రంగా జరిగింది. నిజానికి వాళ్ళ పెళ్లి ఒక మెరుపులా జరిగిందట. యాక్టింగ్ నుండి కాస్త బ్రేక్ తీసుకుని ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిన రోజులు అవి. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత బాగా బిజీగా ఉండేవారు. పనుల్లో మునిగిపోయేవారు. అప్పటికి రామోజీరావు బాగా పాపులర్ అయ్యారు. ఒకరోజు రామారావు గారు రామోజీరావు గారి ఇంటికి వెళ్లారు. ఇంతలో ఒక ఆమె టీ తీసుకుని వచ్చింది. ఆమె ఎవరో కాదు. వసుంధర దేవి.

Ads

వసుంధర దేవి ని చూసి రామారావు ఎవరు ఈమె అని అడిగారు. అప్పుడు రామోజీరావు నా ప్రాణ స్నేహితుడు సూర్యరావు కూతురు ఈమె అని అన్నారు. ఆమే వసుంధర దేవి. రామోజీరావు కి ఆయన భార్యకి వసుంధర అంటే ఎంతో ఇష్టం. వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండేవారు. సూర్యరావు ఎస్ఆర్ఎంటి కంపెనీ అధినేత. ఎక్కువ వ్యాపారాలని ఆయన చేసేవారు. రామోజీరావు వసుంధర తో బాలయ్య పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పగా అన్నగారు దానికి ఒప్పుకున్నారు.

ఇలా పెళ్లి నిశ్చయమైంది వారం తిరగకముందే పెళ్లి చూపులు కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలకి కూడా సంబంధం నచ్చడంతో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 8 1982న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కర్ణాటక కళ్యాణ మండపంలో వీళ్ళ పెళ్లి అయింది. కానీ ఎన్టీఆర్ మాత్రం రాలేదు అప్పటికి ఆయన ప్రచారంలో ఉన్నారు. హరికృష్ణ ఎన్టీఆర్ లేకుండానే బాలయ్య పెళ్లి జరిగిపోయింది.

Previous articleనాని “గ్యాంగ్ లీడర్” లో “స్వాతి” పాత్రలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Next articleహైదరాబాద్ లో ఈ వ్యక్తి యొక్క కేఫ్ లో టీ రుచి చూడని వారు ఉండరు..! ఈయన ప్రయాణం ఎలా మొదలయ్యింది అంటే..?