Ads
ఆన్లైన్ లీక్, పైరసీ లాంటివి నిర్మాతలను, సిని పరిశ్రమను భయపెట్టే విషయాల్లో మొదటి స్థానంలో ఉంటాయి. చిత్ర నిర్మాణం చాలా ఖర్చుతో, ఎంతో కష్టంతో కూడుకున్న ఉండే పని. ఇక భారీ బడ్జెట్ సినిమాకు అయితే వందల కోట్లలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
అలా ఒక చిత్ర యూనిట్ ఎంతో కష్టపడి, చాలా ఆశలు పెట్టుకొని సినిమాను తీస్తే, ఆ సినిమా విడుదల కాకముందే పైరసీ బారినపడినపుడు వారికి ఎంత బాధగా ఉంటుందనేది మాటల్లో వర్ణించలేము. కానీ ఇవేమీ పట్టించుకోని కొంతమంది డబ్బు పై ఉండే ఆశతో పైరసీ చేస్తుంటారు. ఇక ఇప్పటికే చాలా చిత్రాలు విడుదలకు ముందే పైరసీ భూతం బారిన పడ్డాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన అవతార్ 2 కూడా పైరసీకి గురి అయ్యింది. ఆ సినిమా రిలీజ్ కి ముందు రోజున ఆన్లైన్లో పెట్టడంతో అందరు షాక్ అయ్యారు. అయితే ఇలాగే రిలీజ్ కి ముందే ఇప్పటికే చాలా సినిమాలు పైరసీకి బారిన పడ్డాయి. వీటిలో తెలుగు సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా అంటే మూవీ ఎడిటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు యూనిట్ సభ్యులు కొంతమంది సరదాగా చూడడానికి వెళ్లి, ఎవరు చూడకుండా, అక్కడ ఉన్నవారికి తెలీయకుండా మూవీని రికార్డ్ చేస్తున్నారు. ఆ తరువాత మిత్రులకు పంపిస్తుంటారు. వారు ఇంకొకరికి ఇలా అది వెబ్ సైట్ లో పెట్టె వరకూ వెళ్తోంది. ఇలా సినిమా విడుదల అవకుండానే లీక్ అయిన చిత్రాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి అలా విడుదలకు ముందే పైరసీ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Ads
1,శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్2.మగధీర3.ఎవడు4.జై లవ కుశ5.బాహుబలి ది బిగినింగ్
6.అత్తారింటికి దారేది
7.టాక్సీ వాలా8.గీత గోవిందం
9.బాహుబలి2 ది కన్క్లూజన్
10.అరవింద సమేత11) 2.ఓ12) కబాలి
Also Read: హనీ రోజ్ వీరసింహరెడ్డి సినిమా కన్నా ముందు హీరోయిన్ గా ఏ తెలుగు సినిమాలో నటించిందో తెలుసా ?