రియల్ హీరో సోనూ సూద్ గురించిన ఆసక్తికర విషయాలు..

Ads

కరోనా మహమ్మారి సమయంలో ఒకవైపు కరోనా, మరో వైపు లాక్ డౌన్ వల్ల ఎంతో మంది పని కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. వారిని ఆదుకునేందుకు ఆ సమయంలో ఒక రియల్ హీరో బయటకు వచ్చారు. ఆయనే  సోనూసూద్. అడిగినవారికి, అడగని వారికి అనే భేదం లేకుండా పేదలను ఆదుకున్నాడు.

Ads

లాక్ డౌన్ టైమ్ లో స్వంత ఊర్లకు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నవారిని వారి ఊర్లకు పంపడంతో ప్రారంభం అయిన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఎవరు ఎక్కడ నుండి ఎలాంటి ఆపదలో ఉన్నా, వెంటనే ఆయన స్పందిస్తున్న విధానం సోనూ సూద్ ని గొప్ప మానవతావాదిగా నిలబెట్టిందని చెప్పవచ్చు. మరి అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆయన గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..
1. ఇండస్ట్రీ ఎంట్రీ..
1999లో రిలీజ్ అయిన కల్లాజగార్ అనే తమిళ చిత్రంతో సోనూ సూద్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ సినిమాలో విజయ్ కాంత్ హీరోగా నటించగా, సోనూ సూద్ విలన్ గా చేశారు.
2. తొలి తెలుగు సినిమా..
సోనూసూద్ ‘హాండ్స్ అప్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో విలన్ గా చేసిన సోనూ సూద్, మెగాస్టార్ చిరంజీవితో నటించారు.
3. కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాలు
సోనూ సూద్ సినీ కెరీర్ లో 2005ని టర్నింగ్ పాయింట్ అయిన ఏడాదిగా చెప్పవచ్చు. 2005లో ఆయన నటించిన 2 సినిమాలు సోనూ సూద్ కి బ్రేక్ ను ఇచ్చాయి. అవి పూరి జగన్నాధ్ తీసిన సూపర్ మరియు త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు.
4. పశుపతిగా విశ్వరూపం..
హీరోయిన్ అనుష్క నటించిన చిత్రం అరుంధతి ఎంత ఘన విజయం పొందిందో అందరి తెలిసిందే. ఈ చిత్రంలోని విలన్ పాత్రలో పశుపతిగా చేసిన సోనూ సూద్ నటనను ఎవ్వరూ కూడా మరచిపోలేరు. అరుంధతి సక్సెస్ అవడానికి సోనూ సూద్ నటన ఒక కారణం అని చెప్పవచ్చు. ఆ మూవీలో ఆయన చెప్పిన డైలాగ్ వదల బొమ్మాళి అనేది ఇప్పుడు కూడా పాపులర్ డైలాగ్ గానే ఉంది.
5. హాలీవుడ్ ఎంట్రీ..
సోనూ సూద్ లెజెండరీ యాక్టర్ జాకీ చాన్ తో కలిసి హాలీవుడ్ సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు జువాన్జాంగ్.
6.వీటికి దూరం..
సోనూ సూద్ ఆరోగ్యం పట్ల, ఫిట్నెస్ మీద చాలా శ్రద్ద చూపిస్తాడు.కఠినమైన నియమాలను పాటించడమే కాకుండా శాకాహారం మాత్రమే తీసుకుంటారు. ధూమపానం, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉంటారు.
7. యాక్టర్ నుండి ప్రొడ్యూసర్ వరకు..
ఆయన తండ్రి జ్ఞాపకార్ధంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ని శక్తి సాగర్ ప్రొడక్షన్స్ పేరుతో ప్రారంభించారు. ఈ బ్యానర్ లో కుంగ్ ఫు యోగా, తుటక్ తుటక్ టుటియా అనే సినిమాలను నిర్మించారు.
8. సింధు బయోపిక్..
తన సొంత నిర్మాణ సంస్థలో సోనూ సూద్ బ్యాట్మింటన్ సెన్సేషన్ పివి సింధు బయోపిక్ నిర్మించబోతున్నారు. ఈ హక్కులు 2017లోనే దక్కించుకున్నాడు. అయితే వచ్చే ఏడాది ఈ సినిమాని మొదలుపెట్టనున్నాడు.
9. మెడికల్ సిబ్బంది కోసం జూహు హోటల్..
ముంబైలోని జూహులో ఉన్న అత్యంత కాస్ట్లీ హోటల్ ని సోనూ సూద్ కరోనా పేషంట్స్ కి సేవ చేస్తున్న మెడికల్ సిబ్బంది ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చారు.
10. పోకిరిలో హీరోగా చేయాల్సింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాలో పూరి జగన్నాధ్ ముందుగా హీరోగా సోనూ సూద్ ని అనుకున్నారట. కానీ అది ఎందుకో జరగలేదు.కానీ అదే జరిగి ఉన్నట్లయితే ఇప్పుడు సోనూ సూద్ స్టార్ హీరోగా ఉండేవారు.
Also Read: కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలోని ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

Previous articleబుల్లితెర స్టార్ యాంకర్ సుమ అరుదైన ఫోటో గ్యాలరీ..
Next articleరిలీజ్ కు ముందే పైరసీకి గురైన 12 సినిమాలు ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.