”కలెక్టర్” అయ్యుండి కట్నం… ఏం అడిగాడో తెలుసా..?

Ads

ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఏదో సాధించాలని… అనుకున్నది నెరవేర్చుకోవాలని ఉంటుంది. అయితే నిజానికి అందరూ కలలు కంటారు కానీ కొందరు మాత్రమే కలల్ని నిజం చేసుకోగలరు. తమిళనాడుకు చెందిన ఒక అతను ఎంతో కష్టపడి ఐఏఎస్ సాధించాడు ఆయన కథ చూస్తే మీకు కూడా ఆదర్శంగా ఉంటుంది. మరి అతని కథ ఇప్పుడు చూద్దాం.

తమిళనాడు తంజావూరు జిల్లా మెలోట్టంకడు గ్రామానికి చెందిన అతను శివగురు ప్రభాకరన్. ఈయన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అయితే అతని తండ్రి ఎప్పుడు తాగుతూ ఉంటాడు.

కుటుంబ బాధ్యతలని కూడా చూసుకోడు. దీనితో కుటుంబ బాధ్యతలను మోస్తూ వచ్చింది అతని తల్లి. ప్రభాకరన్ కి చదువు మీద ఆసక్తి ఎక్కువ. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డాడు ఇతను. కానీ చదువు మీద ఆసక్తి ఎక్కువ ఉండడం వలన కష్టపడి చదివి ఐఐటి మద్రాస్ లో సీటు పొందారు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ట్యూషన్ చెప్పేవాడు. అలానే మొబైల్ షాప్ లో కూడా పనిచేస్తూ డబ్బులు సంపాదించుకున్నాడు. ఇలా ఎన్నో కష్టాలు పడ్డాడు. అలానే తానూ సంపాదించిన దానిలో కొంత డబ్బుని తన కుటుంబం కోసం కూడా పంపేవాడు. ఇలా ఆఖరికి ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత ఉద్యోగం చేయడం మొదలు పెట్టాడు.

Ads

అలానే ఐఏఎస్ కోసం కూడా ప్రిపేర్ అయ్యాడు. అనుకున్నది సాధించాడు. ప్రభాకరన్ కలెక్టర్ అయ్యాక ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె డాక్టర్. ఆమె ని పెళ్లి కి ముందు కట్నం అడిగాడు. మామూలుగా కట్నం అంటే డబ్బులని ఇస్తారు అలానే ఆడపిల్ల వారు బంగారం వంటివి కూడా పెడుతూ ఉంటారు. కానీ ప్రభాకరన్ అడిగిన కట్నాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎప్పుడు ఎవరు ఇలా కట్నం అడిగి ఉండరు మరి ఇంతకీ ఈ కలెక్టర్ అడిగిన కట్నం ఏమిటంటే.. తర్వాత వారానికి రెండు రోజులు గ్రామాలలో ఫ్రీగా పేదలకు వైద్య సాయం చేయాలట. ఇలా అతను ఆమె కి కండిషన్ పెట్టాడు. ఆమె కూడా ఇందుకు అంగీకరించింది.

Previous articleరిలీజ్ కు ముందే పైరసీకి గురైన 12 సినిమాలు ఏమిటో తెలుసా?
Next article”30 ఇయర్స్ పృథ్వీ” కూతురిని చూసారా..? హీరోయిన్ గా రాబోతోంది మీకు తెలుసా..?