Ads
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. సంక్రాంతికి విడుదలయిన ఈ చిత్రం రికార్డ్ వసూళ్లను రాబట్టి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో మెగాస్టార్ హీరోగా నటించగా, ఆయనను ఎదురించే విలన్ పాత్రలో యాక్టర్ బాబీసింహా నటించారు.
Ads
తమిళ, మలయాళ సినిమాలలో బాబీసింహా యాక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కోలీవుడ్ లో వచ్చిన ‘జిగర్తాండ’ అనే సినిమాలో నటనకు గాను జాతీయ స్థాయిలో బాబీసింహా అవార్డును అందుకున్నాడు. సౌత్ సినీ ఇండస్ట్రీలో గర్వించదగ్గ నటులలో బాబీ సింహా కూడా ఉంటారు. ఆయన కోలీవుడ్ లో విభిన్నమైన పాత్రలలో నటించి, అక్కడ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్నాడు. ఆయన ఒక వైపు హీరోగా నటిస్తూనే, మరో వైపు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం బాబీ సింహ చాలా డిమాండ్ ఉన్న నటుడు. సంచలన విజయం పొందిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి మరింత చేరువయ్యారు. అయితే ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకి ఎక్కువగా తెలియదు. తమిళంలో తెరకెక్కిన ‘జిగర్తాండ’ చిత్రంలో బాబీ సింహా అద్భుతమైన నటనకు గానూ ఆయనకి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. ఇక ఇదే సినిమాని తెలుగులో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ రీమేక్ చేసాడు. ఆ చిత్రమే ‘గద్దలకొండ గణేష్’ ఇందులో వరుణ్ తేజ్ అక్కడ బాబీ సింహా చేసిన పాత్రలో నటించాడు. ఈ సినిమా ఇక్కడ కూడా హిట్ అయ్యింది.
అయితే బాబీ సింహా తమిళ నటుడే కానీ ఏపీకి చెందిన వ్యక్తి. అయితే ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి చెప్పేవరకు ఎవరికి తెలియదు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి బాబీ సింహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకి చెందిన వ్యక్తి అని చెప్పారు. నిజానికి బాబీ సింహా హైదరాబాద్ లోని మౌలాలిలో 1983 నవంబర్ 9న జన్మించాడు. అయితే బాబీ సింహా సొంత ఊరు మాత్రం విజయవాడ దగ్గర ఉన్న బందర్ ప్రాంతం. ఇక ఆయన నాలుగవ తరగతి వరకు మౌలాలిలో చదువుకున్నాడు. అనంతరం కృష్ణ జిల్లాలోని మోపిదేవిలో ఉండే ప్రియదర్శిని విద్యాలయంలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు.
డిగ్రీ చదవడం కోసం కోయంబత్తూరుకి వెళ్ళాడు. ఆ తరువాత కోలీవుడ్ లో సుమారు ఇరవైకి పైగా చిత్రాల్లో నటించాడు. ఆయన సినిమాలలో నటిస్తున్నప్పుడే సహ నటి రేష్మి మీనన్ ప్రేమించి, 2016లో వివాహం చేసుకున్నాడు. బాబీ సింహా ఫ్యామిలీ వ్యవసాయం కోసం తమిళనాడుకు వలస వెళ్ళి, అక్కడే సెటిల్ అయ్యారు. ఆయన భార్య రేష్మీ మీనన్ తెలుగు సినిమాలలో కూడా నటించింది. రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన హైదరాబాద్ లవ్ స్టోరీ అనే మూవీలో, సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన నేనోరకం అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.
Also Read: వీక్ క్లైమాక్స్ కారణంగా విజయం సాధించలేకపోయిన 6 తెలుగు సినిమాలు..