చిరు, బాల‌య్య, నాగార్జున‌లతో న‌టించిన సూపర్ స్టార్ కృష్ణ.. వెంక‌టేష్‌తో న‌టించ‌కపోవడానికి కార‌ణం..

Ads

సినీ పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన చిత్రాన్ని కొన్ని కారణాల వల్ల చేయకపోవడంతో ఆ చిత్రాన్ని వేరే హీరోతో చేయడం అనేది సాధారణమైన విషయం. ఇక వేరే హీరోతో చేసిన ఆ సినిమా హిట్ అయ్యి, ఆ హీరోకు కలిసి రావడం కూడా అందరికి తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ కృష్ణ చేయలేకపోవడం వల్ల ఆ సినిమాతో వెంకటేష్ హీరోగా పరిచయం అయ్యారు.

Ads

అయితే నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ముందుగా వెంకటేష్‌ను హీరోగా చేయాలని అనుకోలేదంట. వాస్తవానికి ఇద్దరు కుమారులైన సురేష్ బాబు , వెంకటేష్‌లను పెద్ద వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనుకున్నారట. అందుకోసం రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబుతో ఒక ఫ్యాక్టరీ పెట్టించారు. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో తండ్రి రామానాయుడుతో పాటుగా సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు చూసుకోవడం ప్రారంభించారు. రెండవ కుమారుడు వెంకటేష్‌ను వ్యాపారవేత్తగా చేయాలనుకుని యూఎస్‌లో ఎంబీఏ చదివించారు.
అయితే వెంకటేష్ మాత్రం అనుకోకుండానే హీరో అయ్యారు. దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ. రామానాయుడు ముందుగా కలియుగ పాండవులు చిత్రాన్ని రాఘవేంద్రరావు డైరెక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణతో చేయాలని భావించారు. రామా నాయుడు అంతకు ముందు కృష్ణతో ముందడుగు,సావాసగాళ్లు, మండే గుండెలు, స్త్రీ జన్మ లాంటి హిట్ సినిమాలను నిర్మించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేదంట. దాంతో హీరో కోసం వెతుకుతుండగా, రామానాయుడు సన్నిహితులు మీ చిన్నబ్బాయి వెంకటేష్ హీరోగా సరిపోతాడని చెప్పడంతో, అలా వెంకటేష్ హీరోగా మారాడు.
సూపర్ స్టార్ కృష్ణ దాదాపుగా రెండవ తరం స్టార్ హీరోలందరితోను నటించారు. కానీ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రం న‌టించ‌లేదు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి కొత్త అల్లుడు, బాలకృష్ణతో కలిసి సుల్తాన్ , నాగార్జునతో కలిసి వారసుడు వంటి సినిమాలలో నటించారు. అయితే త్రిమూర్తులు అనే చిత్రంలో ఒక పాటలో వెంకటేష్ తో కలిసి కొన్ని క్షణాల పాటు కనిపించారు. అయితే వీరిద్దరు ప్రత్యేకంగా కలిసి నటించలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో నటించిన సూపర్ స్టార్ కృష్ణ వెంకటేష్ తో అనివార్య కార‌ణాల వల్ల నటించలేకపోయారు. ఇలా వారి కాంబినేష‌న్ లో ఒక్క సినిమా రాకపోవడం పై అభిమానులు నిరాశ చెందారు.

Also Read:  టాక్ షోలకు రావడానికి సెలబ్రిటీలు రెమ్యూనరేషన్లు తీసుకుంటారా?

Previous articleసీనియర్ హీరో శోభ‌న్ బాబు తన కొడుకును హీరోగా చేయ‌లేదు.. ఎందుకంటే?
Next articleవాల్తేరు వీరయ్య విల‌న్ ”బాబీ సింహా” భార్య‌ తెలుగులో హీరోయిన్ అని తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.