Ads
సాధారణంగా అగ్ర నటుల గురించి ఆడియెన్స్ అందరికి తెలిసిందే. అభిమానులు హీరోల పుట్టిన రోజు దగ్గర నుండి మొదలుపెడితే వారి కుటుంబ వివరాలు, హీరోల సంపాదన, వారి చిత్రాలలో ఎన్ని సినిమాలు ప్లాప్ లేదా హిట్ ఇలా ప్రతి ఒక్కదాని గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
Ads
అయితే ఎక్కువ మందికి అగ్ర హీరోల భార్యల నేపద్యం గురించి కానీ, ఆస్తుల గురించి మాత్రం ఎక్కువగా తెలియదు. దానికి కారణం ఆ విషయాల గురించి హీరోలే మాత్రమే కాకుండా వారి భార్యలు బయటకి చెప్పడానికి ఇష్టపడరు. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరో అయిన అరవిందస్వామి గురించి, ఆయన భార్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం..
అరవింద్ స్వామిని వెండితెరపై చూడగానే చాలామంది అమ్మాయిలు ఆయన పై మనసు పారేసుకున్నారు. ఆయనను ఒక యాడ్ లో చూసిన దర్శకుడు మణిరత్నం తను తెరకెక్కిస్తున్న దళపతి సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్ కోసం ఆయనను తీసుకున్నారు. ఆ చిత్రంలో రజనీకాంత్, మమ్ముట్టి వంటి సూపర్ స్టార్స్ మధ్యలో అరవింద్ నటించి మంచి గుర్తింపు సంపాదించారు. దాంతో ఆ సినిమా తరువాత మణిరత్నం అరవింద్ స్వామి హీరోగా రోజా, బొంబాయి సినిమాలతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలతో అరవింద్ స్వామి అమ్మాయిల కలల రాజకుమారుడిగా మారిపోయాడు.
కొన్నేళ్ల పాటు సిని ఇండస్ట్రీలో ఉన్న ఆయన తరువాత వచ్చిన పోటీని తట్టుకోలేక, అరవింద్ స్వామి మెల్లిగా సినిమాలకు దూరం అయ్యారు. ఇండస్ట్రీని విడిచి బిజినెస్ వైపు వెళ్లారు. అక్కడ కూడా ఆయన సక్సెస్ అయ్యారు. సుమారు 21 సంవత్సరాల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధ్రువ మూవీతో అరవింద్ తెలుగులో నటించారు. ఈ చిత్రంలో విలన్ గా అరవింద్ స్వామి తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక అప్పటి నుండి కీలక పాత్రల్లోనూ, విలన్ గా కూడా నటిస్తూ ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు.
అరవింద్ స్వామి సినీ జీవితం లాగే ఆయన రియల్ లైఫ్ కూడా ఆసక్తి కరంగా ఉంటుంది. అరవింద్ స్వామి భార్య పేరు అపర్ణ ముఖర్జీ. ఆమెకి సిని ఇండస్ట్రీకి చెందని వ్యక్తి. అయితే అపర్ణ ముఖర్జీ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఇండియాలోని ప్రముఖ న్యాయవాదులలో ఆమె కూడా ఒకరు. ఆమె దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తల కేసులను వాదిస్తుంటారు. అది మాత్రమే కాకుండా ఆమెకు వేరే దేశాల్లోని కేసులను వాదించేటువంటి లైసన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అపర్ణ ముఖర్జీ న్యాయవాదిగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగానూ విజయం సాధించారు. ఒక వైపు న్యాయవాద వృత్తి ద్వారా, మరో వైపు వ్యాపారం ద్వారా ఆమె నెలకు దాదాపుగా 30-35 కోట్ల దాకా సంపాదిస్తున్నారట.
Also Read: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 15 రీమేక్ సినిమాల లిస్ట్..