త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఈ లాజిక్ ను ఎలా మిస్ చేశారు..

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ట్రెండ్ ను సెట్ చేసిన చిత్రాలే. పవన్ కల్యాణ్ మూవీ అంటే ఆడియెన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడతాయి. అయితే అప్పట్లో ఆయన సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశపరచడంతో ఆయన ఫ్యాన్స్ కూడా నిరాశ పడ్డారు. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్’ మూవీ రికార్డులు బ్రేక్ చేసింది.

ఆ తరువాత వచ్చిన పవర్ స్టార్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కి హీరోయిన్ గా స‌మంత న‌టించింది. ఈ చిత్రంలోని సెంటిమెంట్, కామెడీ, ఎమోష‌నల్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలోని క్లైమాక్స్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా కూడా త‌క్కువే అనిపిస్తుంది. ఆ సన్నివేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తనలోని నటుడిని పూర్తిగా చూపించారు. అత్త‌ను ఇంటికి రమ్మని చెప్పే డైలాగ్స్ కి ఆడియెన్స్ ముగ్ధులయిపోయారు.
ఇదిలా ఉండగా త్రివిక్ర‌మ్ దర్శకత్వం వహించిన చిత్రాలలో చాలా లాజిక్ లు ఉంటాయి. అయితే త్రివిక్ర‌మ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో మాత్రం ఒక లాజిక్ ను తప్పారు. మరి అది ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ప‌వ‌న్ ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్నప్పుడు క‌మెడియ‌న్ అలీ వ‌చ్చి పవన్ కి సిగ‌రెట్ తీసుకురమ్మని చెప్తాడు. అలీ పవన్ కళ్యాణ్ ను అప్ప‌టి దాకా కార్ డ్రైవ‌ర్ అనుకుంటాడు. దాంతో ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్న ప‌వ‌న్ కళ్యాణ్ అలీని కొట్టడం జరుగుతుంది. ఆ త‌ర‌వాత పవన్ కి పాపం అనిపించడంతో అలిని పిలిచి డ‌బ్బులు ఇస్తాడు.
ఒక సూట్కేస్ ను అలీ చేతికి ఇచ్చి, ఇందులో ఎంత డబ్బు ఉందో తెలియ‌దని, తీసుకుపోమమని చెబుతాడు. అయితే ఎంఎస్ నారాయ‌ణ ఆ సూట్కేస్ ను తెరచి ప‌వ‌న్ కు ఇస్తాడు. ఆయన దానిని పూర్తిగా తెరవకుండానే, అలీకి కి ఇస్తాడు. అందులో లాక్ ను తీసినట్టుగా స్పష్టంగా క‌నిపిస్తుంది. కానీ అలీ సూట్కేస్ తీసుకెళ్లి, తాళం ఇవ్వలేదని వచ్చి అడుగుతాడు.

Ads

అప్పుడు ప‌వన్ కళ్యాణ్ అంతకుముందే తెరిచి ఉన్న సూట్కేస్ ను తీసుకొని సుత్తితో ప‌గ‌లగొట్టి, ఓపెన్ చేసి ఒక క‌ట్టను మాత్రమే అలీ చేతిలో పెడ‌తాడు. ఈ సీన్ చూసినవారు ఓపెన్ చేసి ఉన్న సూట్కేస్ ను ప‌గ‌ల‌గొట్ట‌డం ఎందుకు? ఇదేం లాజిక్ అంటూ త్రివిక్రమ్ ను ట్రోల్ చేస్తున్నారు.

Also read: అత్యంత ధనవంతులైన టాప్ 5 టాలీవుడ్ హీరోలు వీళ్ళే..!

Previous articleఅల్లు అర్జున్ ”అల వైకుంఠ‌పుర‌ములో” చిత్రంలో కనిపించిన ఇంటి ధర ఎంతో తెలుసా?
Next articleహీరో అరవింద్ స్వామి వైఫ్ ఎవరో? ఆమె నేపద్యం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.