బీసీసీఐ ఎందుకు ”లతా మంగేష్కర్‌” కి.. ఎప్పుడూ రెండు వీఐపీ టిక్కెట్లను ఉంచేది..!

Ads

లతా మంగేష్కర్ గురించి తెలియని వారు ఉండరు. ఈమె 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. గాన కోకిల అనే బిరుదుని కూడా ఈమె సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా ఈమె పలు పాటలు పాడారు. భారత ప్రభుత్వం నుండి అత్యుత్తమ పురస్కారాలని అందుకున్నారు లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ కి 2006లో ది లీషియన్ ఆఫ్ హానర్ అనే అవార్టని ఇచ్చారు. 1969లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న ఈమె కి వచ్చాయి.

22 ఫిబ్రవరి 6న ఈమె కరోనా కారణంగా మృతి చెందారు. భారతీయ సినిమా రంగానికి కాకుండా దేశం అంతటికీ కూడా ఈమె మరణం తీరని శ్లోకం మిగిల్చింది.

ఈమె కి క్రికెట్ అంటే కూడా ఎంతో ఇష్టం. ఈమె కి క్రికెట్‌ తో కూడా చాలా మంచి బంధం ఉంది. పైగా స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్ లో ఈమె కి రెండు వీఐపీ సీట్లను బీసీసీఐ రిజర్వ్ చేసారు. ఎందుకు ఈమె కి రిజర్వ్ చేసి ఉంచుతారు. కారణం ఏమిటి..? ఈ విషయానికి వస్తే.. అంతలా బీసీసీఐ ఆమె ని గౌరవించడానికి పెద్ద కారణం ఏ ఉంది. 1983లో టీం ఇండియా వన్డే వరల్డ్‌ కప్‌ కోసం ఇంగ్లండ్‌ వెళ్లింది. ఫైనల్‌కు కూడా ఇండియా వెళ్ళింది. విశ్వవిజేతగా నిలిచింది టీం ఇండియా. కప్ తో ఇండియా వచ్చింది టీం. సన్మాన కార్యక్రమం కూడా చేయాలనుకున్నారు.

Ads

ఆ కార్యక్రమంలోనే ఆటగాళ్లకు కనీసం లక్ష రూపాయలు ఇవ్వాలనుకున్నాడు. కానీ డబ్బులు లేవు. అలానే ఆట ఆడేటప్పుడు ఆటగాళ్ల ఖర్చుల కోసం నానా యాతన పడ్డారు. అయితే డబ్బులు లేవు కానీ ఇంత భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన వారికి ఏమి ఇవ్వకపోతే దేశం పరువుపోతుందని అనుకున్నారు. అప్పుడు లతా మంగేష్కర్‌ ప్రత్యేక సంగీత కచేరి కార్యక్రమం చెయ్యడానికి వచ్చారు. అప్పటికే ఈమె పాపులర్ అయ్యారు. ఈ కార్యక్రమం కోసం చాలా మండే వచ్చారు. బీసీసీఐ కి రూ.20 లక్షల వరకు వచ్చింది. ఆ డబ్బులని వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌ ఆటగాళ్లకు ఇచ్చింది. పైగా లతా మంగేష్కర్‌ రూపాయి కూడా తీసుకోకుండా కార్యక్రమం చేసారు. అందుకే బీసీసీఐ రెండు వీఐపీ టిక్కెట్లను ఆమె కోసం ఉంచేది.

 

Previous article”అవతార్” సినిమాలో కొన్నింటిని మన పురాణాల నుండే తీసుకు వచ్చారా..? ఈ 5 అలానే ఉన్నాయిగా..!
Next articleఐరన్ లోపమా..? ఇలా ఈజీగా గుర్తించి.. ఈ ఆహారాన్ని తీసుకుంటే సరి..!