”అవతార్” సినిమాలో కొన్నింటిని మన పురాణాల నుండే తీసుకు వచ్చారా..? ఈ 5 అలానే ఉన్నాయిగా..!

Ads

అవతార్ సినిమా గురించి మనం స్పెషల్ గా చెప్పుకోక్కర్లేదు. అవతార్ సినిమా గొప్ప సినిమాల్లో ఒకటి. జేమ్స్ కామెరాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాని మీరు చూసినట్లయితే భారతీయ సంస్కృతిని ఆధారంగా తీసుకొని దర్శకుడు ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది. అవతార్ సినిమాలో మన హిందూ ఇతిహాసం నుండి తీసుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి.

అవునండి ఇది నిజమే మన హిందూ సంస్కృతిని ఆధారంగా తీసుకున్న చాలా సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

పైగా ఈ సినిమా దర్శకుడు తనకి హిందూ ఇతిహాసాలు అంటే ఇష్టమని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాని ప్రకారం మనం ఆయన ఈ సినిమాలో సాన్నివేశాలని భారతీయ సంస్కృతిని ఆధారంగా తీసుకుని చిత్రీకరించారు అని చెప్పొచ్చు. త్రేతాయుగంలో ద్వాపరయుగంలో మనుషులు చాలా పొడుగ్గా ఉండేవారు అలానే ఇక్కడ అవతార్ సినిమాలో కూడా నటులని పొడుగ్గా ఉండేటట్టు చూశారు దర్శకుడు.

  • మన పూర్వీకులు ద్వాపరయుగంలో త్రేతాయోగంలో ఉండే మనుషులు సుమారు పది అడుగులు ఉండే వారిని చెప్పడం మీరు వినే ఉంటారు. దానిని ఆధారంగా తీసుకుని ఇక్కడ నావి వాళ్ళని ఇలా రూపొందించారు.
  • అలానే మనం దేవుడి ఫోటోలను చూస్తే కృష్ణుడు, రాముడు నీలం రంగులో ఉండడాన్ని మనం చూడొచ్చు. దానిని దర్శకుడు ఇక్కడ ఉపయోగించారు. అవతార్ లో ఉండే నటులు నీలం రంగులో ఉంటారు.

Ads

  • అలానే మన హిందూ పురాణాల ప్రకారం మనం ఇతరులకి నమస్కారం చేస్తూ ఉంటాము నమస్కారం అంటే ”నాలో ఉన్న ఆత్మ నీలో ఉండే ఆత్మకి ప్రణామం చేయడం”. అయితే అవతార్ సినిమాలో చూసుకున్నట్లయితే హాయ్ అని హలో అని కాకుండా ”ఐ సి యు” అని అంటారు. దానికి ఇంచుమించు ఇదే అర్థం వస్తుంది.
  • టైటిల్లో కూడా మన హిందూ సంప్రదాయం కనబడుతుంది. అదేంటంటే అవతార్ అనే పదమే. హిందూ పురాణాల ప్రకారం దీని అర్ధం మళ్లీ పుట్టడం. భూమి మీద దారి ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు విష్ణుమూర్తి మరొక అవతారాన్ని ఎత్తి అధర్మాన్ని అంతం చేస్తాడు. అవతార్ సినిమాలో కూడా అవతార్ ప్రోగ్రాం తీసుకునే వాళ్ళు నావి ప్రాంతానికి వెళ్తారు. ఇది కూడా ఏదో అవతారాన్ని ఎత్తినట్టే తీసుకొచ్చారు.

  • పురాణాల్లో మనం అమృతాన్ని దేవతలు దేవుళ్ళు తాగడాన్ని వింటుంటాం. అలానే
    అవతార్ 2 సినిమాలో కూడా అమృత అనేది అలానే పనిచేస్తుంది దీనిని కూడా పురాణాల్లో నుంచి తీసుకువచ్చారు.
Previous articleకళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ”అమిగోస్” కి ఇంత అర్థం ఉందా?
Next articleబీసీసీఐ ఎందుకు ”లతా మంగేష్కర్‌” కి.. ఎప్పుడూ రెండు వీఐపీ టిక్కెట్లను ఉంచేది..!