కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ”అమిగోస్” కి ఇంత అర్థం ఉందా?

Ads

ఎన్టీ రామరావు వారసులుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వారిలో కళ్యాణ్ రామ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ఆయన వైవిధ్యమైన సినిమాలు, విలక్ష‌ణ‌మైన రోల్స్ లో న‌టిస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.

Ads

ఇక ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ క్రేజ్ అమాంతంగా మారిపోయింది. అయితే కొన్ని ఏళ్లుగా వరుస అపజయాలు పొందిన ఈ నందమూరి హీరో ప్రస్తుతం హిట్స్ మీద కన్నేశారు. ఇక తాజాగా విడుదలైన క‌ళ్యాణ్ రామ్ న‌టించిన చిత్రం ‘అమిగోస్’. ఈ సినిమాలో ఆయన త్రిపాత్రిభిన‌యం చేశారు. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
ప్రేక్షకులు కమర్షియల్ చిత్రాలను కాకుండా కంటెంట్ ఉన్న చిత్రాలనే ఆదరిస్తారు అనే విషయం  అర్థమైన కళ్యాణ్ రామ్. కంటెంట్ కి ప్రాధాన్యతనిస్తూ కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆడియెన్స్ చూడని కొత్త స్టోరీస్ ని ఎంచుకుంటూ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సరి కొత్త కథతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. బింబిసార మూవీలో ద్విపాత్రాభినయం చేసిన కళ్యాణ్ రామ్, అమిగోస్ లో త్రిపాత్రాభినయం చేశారు.
ఇప్పటివరకు వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమాల కంటే ఈ మూవీ టైటిల్ ఆడియెన్స్ లో ఆసక్తిని పెంచింది. ‘అమిగోస్’ అని ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి ఈ టైటిల్ అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ప్యాన్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక షోకి హాజరైన హీరో కళ్యాణ్ రామ్ ఈ మూవీ టైటిల్ కి అర్థం ఏమిటో చెప్పారు. అమిగోస్ అనే పదం స్పానిష్ పదమని, ఇక మిత్రుడి సూచించడానికి కానీ, రిఫర్ చేయడానికి కానీ ఈ పదాన్ని వాడుతారని తెలిపారు. మొత్తానికి సినిమా టైటిల్ తో ఈ మూవీపై ఆడియెన్స్ కి క్యూరియాసిటీ పెంచారని చెప్పవచ్చు.

Also Read: “అమిగోస్” మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

Previous article”కాంతారా” సినిమాలో శివ ఆఖరున ఎందుకు కనపడకుండా వెళ్ళిపోతాడు..?
Next article”అవతార్” సినిమాలో కొన్నింటిని మన పురాణాల నుండే తీసుకు వచ్చారా..? ఈ 5 అలానే ఉన్నాయిగా..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.