Ads
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ 2021లో డిసెంబర్ 17న విడుదల అయ్యి వసూళ్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బన్నీ ఇమేజ్ ను పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ రష్మిక మందన్న నటించింది.
Ads
ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటుగా ఆడియెన్స్ ని ఆకర్షించిన మరో క్యారెక్టర్ కేశవ.ఈ క్యారెక్టర్ లో నటించిన యాక్టర్ పేరు జగదీష్. పుష్ప మూవీ అతని కెరీర్ కి టర్న్ పాయింట్ అయ్యింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే వాస్తవానికి ఈ క్యారెక్టర్ కోసం ముందుగా ఒక పాపులర్ నటుడిని తీసుకోవాలని అనుకున్నారంట. కానీ కొని చిత్రాల్లో కొన్ని క్యారెక్టర్స్ కొందరి కోసమే పుట్టినట్టుగా అనిపిస్తాయి. ఇక ఆ పాత్రలను వారు చేస్తేనే అద్భుతంగా పడుతాయి. అలాంటి క్యారెక్టర్స్ లో చిన్నాదా, పెద్దాదా అని తేడా ఉండదు. అటువంటి క్యారెక్టర్స్ లో పుష్ప మూవీలోని కేశవ పాత్ర ఒకటి.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ వంటి హీరోతో ఉండే ఫుల్ లెన్త్ పాత్ర. అది కాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. మరి అలాంటి క్యారెక్టర్ ని సహజంగానే ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన నటుడికి ఇస్తారు. కాని పుష్ప చిత్రంలోని కేశవ క్యారెక్టర్ మాత్రం జూనియర్ ఆర్టిస్ట్ అయిన జగదీష్ ను వరించింది.
కేశవ క్యారెక్టర్ చేసిన జగదీష్ సినీ పరిశ్రమలో నాలుగు సంవత్సరాలుగా చాలా కష్టాలు అనుభవించాడు. అతని నాలగు సంవత్సరాల కృషికి దొరికిన అద్బుతమైన పాత్ర కేశవ. అయితే ఈ క్యారెక్టర్ కోసం జగదీష్ కన్నా ముందుగా చాలా మందిని అనుకుని, వారికి సుకుమార్ ఆడిషన్ చేశారట. అయితే ఫైనల్ గా జగదీష్ ను ఎంపిక చేశారంట.ఇక ఈ క్యారెక్టర్ కోసం అనుకున్న వాళ్లలో యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా ఉన్నాడంట.
యాక్టర్ మహేష్ విట్టా రాయలసీమ యాసను చక్కగా పలకగలడు. మహేష్ విట్టా వీడియోలు అన్నీ రాయలసీమ స్లాంగ్ లోనే ఉంటాయి. అందువల్ల మహేష్ ను తీసుకోవాలని అనుకున్నారంట సుకుమార్ తో పాటుగా పుష్ప మూవీ యూనిట్. అంతే కాకుండా ఈ ఆడిషన్ కి మహేష్ వెళ్ళాడంట. అక్కడ మహేష్ కు సన్నివేశానికి సంబంధించిన పేపర్స్ ఇచ్చారంట. తరువాత దాదాపు ఒకే చేశారట. మహేష్ విట్టా ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే చివరకు ఒక కొత్త కుర్రాడిని తీసుకున్నారని అన్నారు.
Also Read: చిరు, బాలయ్య, నాగార్జునలతో నటించిన సూపర్ స్టార్ కృష్ణ.. వెంకటేష్‌తో నటించకపోవడానికి కారణం..