మహేష్-నమ్రత 18 ఏళ్ళ వివాహ బంధం.. అరుదైన ఫోటోని షేర్‌ చేసిన నమ్రత..

Ads

తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌ అంటే గుర్తొచ్చే జంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జోడీ కూడా ఒకటి. అంతగా ఈ జంట ఆకట్టుకున్నారు. వీరు సినిమాలో నటిస్తున్నప్పుడు అయిన పరిచయం, ప్రేమగా మారి,పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

ఇక వీరి ప్రేమకి ప్రతిరూపంగా గౌతమ్ కృష్ణ, సితారలు జన్మించారు. ఫిబ్రవరి 10న వీరి పెళ్లి రోజు. మహేష్, నమ్రత వివాహం జరిగి 2023 ఫిబ్రవరి 10 నాటికి సరిగ్గా 18 సంవత్సరాలు గడించింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు, నమ్రతలు ఒకరికొకరు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మహేష్ తన ఇన్‌స్టా అకౌంట్ లో నమ్రతతో దిగిన ఒక పాత ఫోటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పగా, నమ్రత మహేష్ తో ఉన్న ఒక అరుదైన ఫోటోను షేర్ చేస్తూ మహేష్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు ఈ జంటకి పెళ్లి రోజు విషెస్ తెలిపారు. కొంతమంది ‘మీ జంట ఎప్పుడు ఇలాగే ఉండాలని కామెంట్స్ చేస్తూన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
సినిమాల్లో నటిస్తూ ఆ తరువాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేష్, నమ్రత జోడీ ఒకటి. అయితే వీరి ప్రేమకథ ఎలా ప్రారంభం అయ్యిందంటే సూపర్ స్టార్ మహేష్ బాబు , నమ్రతలు ‘వంశీ’ మూవీలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ న్యూజిలాండ్‌‌ లో నెల రోజులు జరిగింది. వీరిద్దరి మధ్య ఆ సమయంలోనే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా ఆ తరువాత ప్రేమగా మారింది. అయితే ముందుగా లవ్ ప్రపోజ్ చేసింది నమ్రతనే. అప్పటికే మహేష్‌ నమ్రతను ఇష్టపడుతుండడంతో వెంటనే ఒకే చెప్పేశారంట.
అలా ఈ ప్రేమజంట దాదాపు 4ఏళ్లపాటు ప్రేమలో మునిగితేలారు. అయితే సెలబ్రిటీల పర్సనల్ విషయాలు సాధారణంగా మీడియాకు లీకవుతుంటాయి. కానీ మహేశ్‌ బాబు -నమ్రతల విషయం బయటికి రాకపోవడం విశేషం. నాలుగేళ్ళ తర్వాత ఇద్దరు వారి కుటుంబ సభ్యులకు తమ లవ్ గురించి చెప్పారట. మొదట్లో మహేష్ ఫ్యామిలీ కొంచెం బెట్టు చేయడంతో, మహేష్ సోదరి మంజుల అందరిని ఒప్పించిందట. ఆ విధంగా ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో 2005లో ఫిబ్రవరి 10న వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది.
హీరోయిన్ గా పిక్ స్టేజ్ లో ఉన్న నమ్రత వీరి పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా వీడ్కోలు పలికి, ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటుంది. ఇక ఈ జంట వివాదాలకు ఆమడ దూరంలో ఉంటుంది. అందుకే అందరు వీరిని కూల్ క్యూట్ కపుల్ గా పిలుస్తుంటారు. ఈ జంట బయట ఎక్కువగా కనిపించకపోయినా వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు లేదా స్పెషల్ సందర్భాలలో మహేష్, నమ్రతలు ఒకరిపై ఒకరు ప్రేమను తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంటారు. వీరి కుమార్తె సితార సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.
Also Read: SHIVA VEDHA REVIEW : ”శివ వేద” సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్…!

Ads

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Previous articleఅల్లు అర్జున్ పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న బిగ్ బాస్ ఫేమ్ ఎవరో తెలుసా..?
Next articleమీ మొబైల్ ఫోన్‌ని ఉపయోగించి హోటల్ రూమ్ లో ఉండే సీక్రెట్ కెమెరాలను ఎలా కనుగొనాలో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.