Ads
మహా శివరాత్రి పరమ శివునికి ప్రీతికరమైన రోజు. హిందూవులకు పవిత్రమైన రోజు. మహా దేవుడిని ప్రతిరోజూ పూజించే భక్తులు శివరాత్రి రోజున శివున్ని భక్తిశ్రద్ధలతో అభిషేకిస్తారు. మహా శివరాత్రి భక్తులంతా ఉపవాసం ఉండి, జాగరణ చేస్తారు.
రోజంతా శివనాస్మరణ చేస్తూ గడిపి, ప్రదోష వేళలో శంకరుడిని అభిషేకించడంతో పాటుగా రుద్రాభిషేకం, బిల్వార్చన కూడా చేయడం వలన మహా దేవుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహా శివరాత్రి వస్తోంది. ఆ రోజున కొన్ని పనులు చేయకూడదు. మరి ఆ రోజున చేయకూడని మరియు చేయవలసిన పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
శివరాత్రి రోజున చేయాల్సిన పనులు:
ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి రెండు గంటల ముందే లేచి, ధ్యానం చేసుకుని, తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. తెల్లని దుస్తులను ధరిస్తే మంచిది. ఈ రోజున తప్పకుండా శివాలయాన్ని సందర్శించాలి.’ఓం నమఃశివాయ’ మంత్రాన్ని జపిస్తూ మహాదేవున్ని స్మరించుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే శివయ్యకి పెట్టె నైవేద్యంలో పులిహోర ఉండేట్టు జాగ్రత్త పడాలి. పంచామృతంను సమర్పించాలి. మారేడు ఆకులతో శివుడిని ఇంట్లోనూ, గుడిలోనూ పూజించాలి. ఇక ఉపవాసం ఉండే భక్తులు పండ్లు, పాలు లాంటి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. శివాలయంకు వెళ్లే మగవారు చొక్కాలు కాకుండా కండువాను ధరించాలి. తప్పనిసరిగా జలాభిషేకం చేయాలి. పసుపును కాకుండా చందనాన్ని శివునికి సమర్పించాలి. మహాశివరాత్రి రోజున శివుడిని నాగమల్లి పూలతో పూజిస్తే మహాదేవుని అనుగ్రహం కలుగుతుంది.
Ads
శివరాత్రి రోజున చేయకూడని పనులు :
మహా శివరాత్రి రోజున శివలింగంకు తులసి పత్రాలను సమర్పించకూడదు. నలుపు రంగు వస్త్రాలను దూరంగా ఉండాలి. ఈరోజు ప్యాకెట్ పాలతో శివయ్యను అభిషేకం చేయకూడదు. ఆవు పాలతోనే శివునికి అభిషేకం చేయాలి. అలాగే అభిషేకం చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు. శివలింగానికి కొబ్బరి నీటిని సమర్పించకూడదు.
స్త్రీలు అభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని ముట్టుకోకూడదు. అభిషేక సమయంలో శరీరం నుండి వచ్చే చెమట కానీ, వెంట్రుకలు కానీ శివలింగం పై పడకుండా జాగ్రత్తగా ఉండాలి. పవిత్రమైన ఈ రోజున మద్యం కానీ, మాంసం కానీ తినకూడదు. ఇక ఈ రోజున చీమకు కూడా హాని చేయకూడదు. అలాగే అసభ్యమైన పదాలను మాట్లాడకూడదు. ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు.
Also Read: చెడు శక్తులు పోయి సమస్యలేమీ లేకుండా ఉండాలంటే… ఇలా హనుమంతుడిని పూజించండి..!