అసలు ”టీ” మన దేశ ప్రజలకి.. ఎలా అలవాటు అయ్యిందో తెలుసా..?

Ads

చాలా మందికి టీ అంటే ఎంతో ఇష్టం. ప్రతి రోజు వాళ్ళ రోజుని టీ తోనే మొదలు పెడతారు నిజానికి ఉదయాన్నే ఒక కప్పు టీ తాగితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒక సారి అలవాటు అయిపోతే మానుకోవడం కూడా కష్టం. లిమిట్ గా రోజూ టీ తాగితే ఎలాంటి నష్టాలు కూడా కలగవు. నిజానికి లిమిట్ గా టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

అయితే ఇప్పుడు మనం రోజు టీ తాగేస్తున్నాము కానీ అసలు టీ ఎలా వచ్చింది..? ఎప్పుడు వచ్చింది..? ఎవరు తీసుకొచ్చారు అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.

Ads

  • టీ అసలు మనది కాదు. టీ బ్రిటిష్ వారిది అయితే బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన చాలా అలవాట్లని మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాము. అందులో ఒకటి టీ. అసలు మనం ఈరోజు టీ తాగుతున్నామంటే దానికి కారణం బ్రిటిష్ వాళ్లే.
  • ఇక ఎప్పుడు వచ్చిందనేది చూస్తే.. 1850 ల్లో అసోం కొండల్లో ఆసమ్‌ తేయాకు తోటల పెంపకం మొదలైంది.
  • కానీ టీ టేస్ట్ మాత్రం 1930 ప్రాంతంలోనే అందరూ చూసారు.

  • భారతీయ తేయాకు విపణి విస్తరణ సంస్థ ని కూడా పెట్టారు. ఇలా టీ రుచి చూపారు బ్రిటిష్‌వాళ్లు.
  • ఆ తరవాత టీ వ్యాపారంగా మారింది. అలానే రోడ్డు మీద వెళ్లే వారికి టీ ని ఫ్రీగా ఇవ్వడం కూడా మొదలుపెట్టారు.
  • రైల్వే స్టేషన్ల లో ప్రత్యేకమైన టీ స్టాళ్లు పెట్టారు. ప్రకటనలని కూడా చేసారు. అప్పటి ప్రకటన బోర్డు ఇప్పుడు కూడా పశ్చిమ్‌ బెంగాల్‌ లోని దమ్‌ దమ్‌ రైల్వే స్టేషన్‌ మూడో నెంబర్‌ ప్లాట్‌ ఫామ్‌ మీద వుంది.
  • ఇలా ఓ సారి టీ రుచి కి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ టీ పొడిని కొనే వారు.
Previous articleమహా శివరాత్రి పర్వదినాన చేయకూడని పనులు ఏమిటో తెలుసా?
Next articleవాచీలు, గడియారాల్లో డిఫాల్ట్ గా ”10 :10” అని ఎందుకు ఉంటుంది..?