40 ఏళ్ళు దాటాయా..? అయితే ఈ ఆహారాన్ని తీసుకోండి..!

Ads

వయసు పైబడేకొద్దీ మనం ఆహారం విషయంలో మార్పులు చేసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మన వయసు పెరిగే కొద్ది హార్మోన్ల పనితీరు మారుతూ ఉంటుంది. జీవక్రియలో కూడా తేడాలు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు రోజు వారి జీవితం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే అలాంటప్పుడు ఆరోగ్యం బాగుండాలి అంటే మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి.

మంచి పోషకాహార ని డైట్ లో తీసుకుంటే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అయితే మరి 40 ఏళ్ళు దాటిన మహిళలు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో చూద్దాం.

1.బెర్రీస్:

40 దాటిన వాళ్ళు బెర్రీస్ ని డైట్ లో కచ్చితంగా తీసుకోండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ని నిరోధిస్తాయి. స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది. అలానే గుండె ఆరోగ్యం మెదడు పనితీరు కూడా బాగుంటుంది కాబట్టి 40 దాటిన వాళ్లు బెర్రీస్ ని కచ్చితంగా తీసుకుంటూ ఉండండి.

Ads

2. నల్లని బీన్స్:

నల్లని బీన్స్ ని కూడా 40 దాటిన మహిళలు డైట్ లో చేర్చుకోవాలి. బ్లాక్ బీన్స్ లో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ ఉంటుంది. హార్మోన్లకి సంబంధించిన సమస్యలు రావు మెగ్నీషియం పొటాషియం కూడా మీకు అందుతుంది. రక్త పోటు గుండె జబ్బులు కూడా ఉండవు.

3. వాల్నట్స్:

డైట్ లో మీరు వాల్నట్స్ ని కూడా చేర్చుకోవడం మంచిది వాల్నట్స్ ని తీసుకోవడం వలన ఆక్సిడేషన్ ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తూ ఇంఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలానే మీ బరువుని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. వీటితో పాటుగా తాజా పండ్లు, తాజా కూరగాయలను కూడా మీరు మీ డైట్ లో చేర్చుకుంటూ ఉండండి ఆరోగ్యం బాగుంటుంది.

Previous articleఈ తెలుగు హీరోల హైట్ ఎంతో మీకు తెలుసా..?
Next articleవాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఇంట్లో ఏ దిక్కులో ఉంచాలి ? ఆ ప్రాంతంలో అస్సలు ఉంచకూడా ?