బాల‌య్య‌, చిరంజీవి గురించి అప్పట్లో ఎన్టీఆర్ ఇలా అన్నారా..? నిజమైందిగా మరి..!

Ads

సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనం స్పెషల్ గా చెప్పుకోక్కర్లేదు. ఏ పాతనైనా సరే అన్న గారు చేసి అందర్నీ ఆకట్టుకోగలరు. పైగా అన్నగారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతా అంతానా..? ప్రతి ఒక్కరూ అన్న గారి నటనకి ఫిదా అయిపోతుండేవారు. ఎన్టీఆర్ గారికి అప్పట్లో క్రేజ్ కూడా ఎక్కువగా ఉండేది. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్ళల్లా ఉండేవారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ వచ్చి.. నటించి.. సినిమా స్థాయిని పెంచేందుకు కృషి చేశారు.

చిరంజీవికి బాలకృష్ణకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటూ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు.రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. మెగాస్టార్ మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇక బాలయ్య విషయానికి వస్తే.. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో మంచి హిట్ ని అందుకున్నారు. తాజాగా చిరంజీవి బాలకృష్ణ గురించి వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అశ్విని దత్ చిరంజీవి ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు చేశారు. అలానే బాలయ్యతో అశ్వమేధం చిత్రాన్ని రూపొందించారు.

Ads

ఇంద్ర, అతిలోకసుందరి, చూడాలని ఉంది వంటి మెగాస్టార్ సినిమాలను కూడా రూపొందించారు అశ్విని దత్, ఓసారి షూటింగ్ టైంలో బ్రేక్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ అల్లు రామలింగయ్య మాట్లాడుకున్నారట. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయాలని తాజాగా అశ్విని దత్ చెప్పారు. ఎన్టీఆర్ అల్లు రామలింగయ్య చిరంజీవి నటించిన పాపులర్ సినిమాలు అలానే బాలయ్య నటించిన పాపులర్ సినిమాల గురించి మాట్లాడుకోవడం జరిగిందట.

వాళ్లు అప్పట్లో సినీ పరిశ్రమని మీ అల్లుడు చిరంజీవి మా కొడుకు బాలయ్యదే అని ఎన్టీఆర్ అల్లు రామలింగయ్య తో చెప్పారట. ఒకసారి కాదు చాలా సార్లు ఈ విషయాన్ని ఎన్టీఆర్ చెప్పారట. ఆ తర్వాత ఎన్టీఆర్ చెప్పినట్లుగానే ఈ ఇద్దరు హీరోలు కూడా చాలా సినిమాలు చేసే హిట్ ని అందుకున్నారు అయితే పెద్దాయన ఆరోజు చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతోందని అశ్విని దత్ తాజాగా షేర్ చేసుకున్నారు.

Previous articleఈ విషయంలో తన తండ్రి చెప్పినా తగ్గేదే లేదు… అంటున్న చిరంజీవి పెద్ద కూతురు..
Next articleమీ మధ్య ఇలా ఉంటే ప్రేమ వున్నట్టే.. లైఫ్ లో నో ప్రాబ్లెమ్..!