Ads
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ దగ్గర కూడా రికార్డులను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.
Ads
ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. న్యూయార్క్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను కూడా దక్కించుకుంది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట నామినేట్ అయ్యింది. ప్రస్తుతం అందరు ఆస్కార్ అవార్డు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించగా, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మూవీ చేయడానికి స్ఫూర్తినిచ్చిన 2 చిత్రాల గురించి రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఈ సినిమా తెరకెక్కించడానికి తెలుగు ఐకానిక్ చిత్రం అయిన మాయబజార్ సినిమా మరియు మిల్ గిప్సన్ తెరకెక్కించిన బ్రేవ్ హార్డ్ తనను ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమురంభీం సాంగ్ ను తీయడానికి ప్రేరేపించిందని రాజమౌళి తెలిపాడు. ఇక మాయాబజార్ సినిమాలో ఉపయోగించిన భాష మహాభారతంలోనిదని, ఈ సినిమాలోని క్యారెక్టర్స్ మాట్లాడే భాష ఆధునిక తెలుగు భాష. అయితే గతంలో వచ్చిన నాటకాలు, సినిమాలలోని క్యారెక్టర్స్ కోసం పుస్తక భాషను వాడేవారని అన్నారు. దర్శకుడు ఏదైనా చేయగలరని నా నమ్మకమని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా నిజమైన క్యారెక్టర్స్ తో ఉన్న కల్పితమైన కథ అని, ఈ చిత్రానికి మాయాబజార్ సినిమా స్పూర్తిని ఇచ్చిందని ఆయన వెల్లడించారు. మెల్ గిబ్సన్ బ్రేవ్ హార్ట్ చిత్రం ఆధారంగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీముడో పాటను చిత్రీకరించామని ఆయన తెలియచేసారు. అంతేకాక రాజమౌళి మాట్లాడుతూ తనకు పాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చిత్రం నచ్చలేదని, ఆ చిత్రం చాలా హింసాత్మకంగా ఉంటుందని అన్నారు.
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించే పనుల్లో ఉన్నారు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ లేకపోయినా కూడా ఈ సినిమా రికార్డులను సృష్టించడం గ్యారంటీ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక రాజమౌళి డిమాండ్ చేస్తే ఎంతయినా పారితోషికం ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే జక్కన్న మాత్రం పారితోషికం కన్నా మంచి సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తుండటం గమనార్హం.
Also Read: హీరోగా మారిన ‘అతడు’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్..