Ads
సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో మల్టీస్టారర్ గా వచ్చిన సినిమా భీమ్లా నాయక్. ఈ మూవీ గత ఏడాది ఫిబ్రవరి 25న విడుదల అయ్యింది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీసు దగ్గర విజయాన్ని అందుకుంది.
Ads
మలయాళంలో వచ్చిన అయ్యప్పమ్ కోషియం రీమేక్ గా ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెలుగు నెటీవీటికి తగినట్టుగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలోని ఒక ఫైట్ సీన్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో డానియల్ శేఖర్ గా నటించిన రానాకు , పవన్ కళ్యాణ్ కి మధ్య ఫైట్ సన్నివేశాలు ఉన్నాయి. ఎప్పుడు ఈ రెండు పాత్రలు కలిసినా ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. ఇద్దరు కూడా నువ్వా నేనా అనేట్టుగా పోటీ పడుతూ ఉంటారు.
ఒకరి మీద ఒకరు విరుచుకు పడిపోతుంటారు. ఈ సన్నివేశాలు ఇద్దరి అభిమానులలోనూ ఊపుని తీసుకొచ్చాయి. ఇక థియేటర్లో చూసిన ఫ్యాన్స్ కి ఉద్రేకానికి గురి చేశాయి. ఇక సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్, రానా మధ్యన వచ్చే ఫైట్ సన్నివేశాలు సహజంగా ఉంటాయి. అందువల్ల ఆ సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ఈ ఫైట్ సన్నివేశాలని ఫలానా దగ్గర నుండి తీసుకున్నారనే చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీ క్లైమాక్స్ ఫైట్ సన్నివేశాలను రామాయణంలోని సన్నివేశంతో నెటిజన్లు పోలుస్తున్నారు.
మలయాళంలో అయ్యప్ప నాయర్ తన ప్రత్యర్థిని గట్టిగా బిగించి పట్టుకుని చంపేందుకు ప్రయత్నిస్తాడు. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్, రానా మెడ మీద కాలుతో తొక్కడం ద్వారా చంపేందుకు ప్రయత్నిస్తాడు. రామాయణంలో వాలి సుగ్రీవుడితో యుద్ధం చేసే సమయంలో కాలిని సుగ్రీవుడు భుజం మీద పెట్టి, తరువాత సుగ్రీవుడు చేయిని పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తాడు. అలాగే `భీమ్లా నాయక్` మూవీలో కూడా పవన్ కళ్యాణ్, రానా మధ్య ఒక ఫైట్ సీన్ ని డిజైన్ చేశారు. అదే రానా భుజం పై కాలు పెట్టి చంపాలనుకునే సన్నివేశాన్ని క్రియేట్ చేశారు.
Also Read: నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర ఎవరి కూతురో తెలుసా?