నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర ఎవరి కూతురో తెలుసా?

Ads

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఆయనను అభిమానులు బాలయ్య అని ప్రేమాగా పిలుకుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుసగా సినిమాలలో నటిస్తున్నాడు.

Ads

ఓటీటీ లో హోస్ట్ గా బిజీగా ఉన్నారు. తెలుగు ఓటీటీ అయిన ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ టాక్ షోతో అందరిని అలరిస్తున్నారు. ఆ షోలో ఆయన మాట్లాడే విధానానికి, వచ్చిన గెస్ట్ లతో వ్యవహరించిన తీరుకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ విషయాలను పక్కన పెడితే, బాలకృష్ణ తన భార్య వసుంధర దేవి గురించి ‘అన్ స్టాపెబుల్’ టాక్ షోలో ప్రస్తావించారు. అంతేకాకుండా బాలయ్య తన భార్యకు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పారు. ఈ క్రమంలోనే బాలయ్య భార్య ఎవరని, ఆమెకు ఉన్న ఆస్తి గురించి వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఆమె గురించి ఇప్పుడు చూద్దాం.. ఎన్టీ రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలక్రిష్ణ విజయవంతంగా తన కెరీర్ లో రాణిస్తూ, టాప్ 4 హీరోలలో ఒకరిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. బాలక్రిష్ణ 1982 లో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఎవరో కాదు. శ్రీరామదాసు మోటార్ కంపెనీ అధిపతి అయిన దేవరపల్లి సూర్యారావు కుమార్తనే. వందల కోట్ల ఆస్తులకు వారసురాలైన వసుంధర దేవి గ్రాడ్యుయేషన్ పోర్టయి చేశాకనే బాలక్రిష్ణను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత బాలక్రిష్ణ సినిమాలతో చాలా బిజీగా ఉండడంతో, ఫ్యామిలీ వ్యవహారాలన్నిటినీ కూడా వసుంధర దేవినే చూసుకుంటూ వస్తుంది.ఇక బాలకృష్ణ,వసుంధర దంపతులకు ముగ్గురు పిల్లలు. వారు కూతుర్లు బ్రాహ్మణి, తేజస్వి, కుమారుడు మోక్షజ్ఞ. పెద్ద కూతురు బ్రాహ్మణిని నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ కు ఇచ్చి వివాహం చేశారు. రెండవ కూతురు తేజస్వినికి గీతం సంస్థలకు చెందినటువంటి శ్రీ భరత్ తో పెళ్లి చేశాడు. ఇక బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ త్వరలో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టబోతున్నాడని వార్తలొస్తున్నాయి.అది అఫీషియల్ గా అయితే కన్ఫర్మేషన్ రాలేదు.
Also Read: ఈ స్థాయికి రావడానికి.. ”ప్రభాస్” ఇంత కష్టపడ్డాడా..?

Previous articleపారిజాత పుష్పాలను పొరపాటున కూడా వేరేవారి దగ్గర నుండి తీసుకోని పూజ చేయకూడదు.. ఎందుకో తెలుసా?
Next articleఒక్కరు చాలు .. ఇద్దరు పిల్లలు వద్దని అనుకుంటున్నారా? అయితే ఆలోచించాల్సిందే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.