రాఘవేంద్ర రావు దగ్గర శిష్య‌రికం చేసిన స్టార్ డైరెక్ట‌ర్లు వీరే..!

Ads

ఒక్కసారిగా ఎవరూ కూడా మంచి పొజిషన్ లోకి వెళ్లలేరు. ఓ స్థాయి కి చేరుకోవడానికి సమయం పడుతుంది. ఇప్పుడు ఉన్న టాప్ డైరెక్టర్లు కూడా ఒకప్పుడు ఒకరి కింద పని చేసిన వారై ఉంటారు. రాఘవేంద్ర రావు గారి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రాఘవేంద్ర రావు గారు చాలా సినిమాలని తెర మీద కి తీసుకు వచ్చారు. దర్శకేంద్రుడు అని అంటారు రాఘవేంద్ర రావుని. 100కు పైగా చిత్రాలని ఆయన తీసుకు రావడం జరిగింది.

 

పైగా వాటిలో చాలా హిట్లు కూడా ఉన్నాయి. అయితే రాఘవేంద్ర రావు దగ్గర శిష్యరికం చేసిన దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు చూసేద్దాం.

బి గోపాల్:

బి గోపాల్ రాఘవేంద్రరావు దగ్గర పని చేశారు. యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఈ దర్శకుడు తీసుకు వస్తారు. ఇక ఈయన రాఘవేంద్రరావు దగ్గర ఎప్పుడు పని చేసారు అనేది చూస్తే… అడవి రాముడు సినిమా నుండి ఆయన రాఘవేంద్రరావు దగ్గర పని చేసే వారు. ప్రతిధ్వని సినిమాతో దర్శకుడిగా మారారు.

Ads

రాజమౌళి:

రాజమౌళి కూడా రాఘవేంద్ర రావు దగ్గర రెండు మూడు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ కింద పని చేయడం జరిగింది. కానీ చాలా మందికి ఈ విషయం తెలీదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి అవకాశం ఇచ్చింది కూడా ఆయనే.

వైవిఎస్ చౌదరి:

వైవిఎస్ చౌదరిగుడా రాఘవేంద్ర రావు దగ్గర పని చేశారు పట్టాభిషేకం సినిమా నుండి అన్నమయ్య సినిమా దాకా ఈయన రాఘవేంద్ర రావు దగ్గర పని చేశారు.

కోదండరామి రెడ్డి:

డైరెక్టర్ గా మారిన కోదండరామి రెడ్డి కూడా మొదట రాఘవేంద్రరావు దగ్గర పనిచేశారు ఆ తర్వాత అద్భుతమైన సినిమాలని తెర మీదకి కోదండరామి రెడ్డి తీసుకు రావడం జరిగింది.

 

Previous articleటాలీవుడ్‌ లో ఎక్కువ రెమ్యున‌రేషన్ తీసుకుంటున్న ద‌ర్శ‌కులు వీళ్ళే..!
Next articleభీమ్లా నాయక్ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌, రానాకు మధ్య జరిగే ఫైట్ సీన్ ని అక్కడి నుండి తీసుకున్నారా?