Ads
దివంగత నటుడు నందమూరి తారకరత్న, ఎన్టీ రామారావు కుమారులలో ఒకరైన మోహన కృష్ణ కుమారుడు. తారకరత్న బాబాయ్ నందమూరి బాలకృష్ణ స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తారకరత్న సినీ ఎంట్రీ చాలా వైభవంగా ప్రారంభం అయ్యింది.
Ads
ఒకే రోజు తొమ్మిది చిత్రాలను ప్రకటించి, పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి, తారకరత్న చరిత్ర సృష్టించాడు. ఆ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. అంత గ్రాండ్ గా మొదలైన తారకరత్న సినీ కెరీర్ అంతగా సాగలేదు. తారకరత్న హీరోగా స్టార్ట్ అయిన తొలి చిత్రం యువరత్న. ఈ మూవీకి నందమూరి రామకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ సొంత బ్యానర్ లో చేశారు.
అయితే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఒకటో నెంబర్ కుర్రాడు మూవీ తారకరత్న తొలి చిత్రంగా విడుదల అయ్యింది. ఈ చిత్రం విజయం సాధించింది.ఆ తరువాత యువరత్న మూవీని రిలీజ్ చేశారు. కానీ ఆ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన తారకరత్న సినిమాలు కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కాగా ఆయన కెరీర్ మొదట్లో 2 సూపర్ హిట్ చిత్రాలను వదులుకున్నాడట.అందులో ఒక సినిమా ఈశ్వర్. ఈ చిత్రంతోనే ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యాడు. అప్పట్లో ఈశ్వర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాని తారకరత్నతో చేయాలని భావించారంట. అయితే కారణం ఏమిటో తెలియదు కానీ చివరి నిమిషంలో ఈ మూవీ క్యాన్సిల్ అయ్యిందట.
రెండవ సినిమా గంగోత్రి. ఈ సినిమాతోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాని ముందుగా తారకరత్నతో చేయాలని అనుకున్నారట. కానీ తరువాత అది కుదర్లేదు. అలా తారకరత్న ఇద్దరి స్టార్ హీరోల తొలి చిత్రాలను మిస్ చేసుకున్నాడు. తన కెరీర్ ఎదుగుదలకి కావలసిన సూపర్ హిట్స్ ని అందుకునే ఛాన్స్ కోల్పోయాడు.
Also Read: నందమూరి తారకరత్న చివరి కోరిక తీర్చేందుకు సిద్ధపడుతున్న భార్య అలేఖ్య రెడ్డి..