Ads
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉందనే విషయం అందరికి తెలిసిందే. ఎన్టీ రామారావు, బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు నందమూరి ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా నిలిచారు.
Ads
కొందరు నిర్మాతలుగా, ఇంకొందరు మంచి బిజినెస్ మెన్స్ గా ఎదిగారు. అలాంటి నందమూరి ఫ్యామిలిలో బయటకు రాని ఆ ఫ్యామిలికి చెందిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇటీవల నందమూరి తారకరత్న మరణించడంతో ఆయన గురించి మాత్రమే కాకుండా నందమూరి ఫ్యామిలీ గురించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. కొందరు ఫామిలి సీక్రెట్స్ అంటే, మరికొందరు చీకటి కోణాలుగా చెబుతున్నారు. మరి అవి ఏమిటో, ఎవరికి సంబంధించినవి అనేది ఇప్పుడు చూద్దాం..నందమూరి ఫ్యామిలీ చీకటి నిజాలకి మొదటి ఉదాహరణ త్రివిక్రమ రావు. ఎన్టీ రామారావు, త్రివిక్రమ రావు ఇద్దరు మంచి అనుబంధం కలిగిన సోదరులు. వీరిని చూసినవారు ఈ అన్నదమ్ముల బంధాన్ని సినిమాగా తీయవచ్చు అనేవారు. అంతటి ప్రేమనురాగలు కలిగిన వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం కానీ, ఎందుకు విడిపోయారో ఇప్పటివరకు బయటకు రాలేదు. దాని గురించి కూడా ఎవరు మాట్లాడరు. ఇక త్రివిక్రమ రావు తన కుమారులను సినీ పరిశ్రమకి పరిచయం చేసే టైమ్ లో కూడా ఎన్టీ రామారావు సపోర్ట్ చేయలేదు అని ఇండస్ట్రీలో టాక్ ఉండేది. త్రివిక్రమ రావు కొడుకు కళ్యాణ చక్రవర్తి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన హఠాత్తుగా పరిశ్రమని ఎందుకు వదిలి వెళ్లారనే విషయం కూడా ఇప్పటికి బయటకు తెలియదు. అంతే కాదు ఈ విషయం పై నందమూరి కుటుంబం ఎప్పుడు మాట్లాడలేదు.
హీరో నవీన్ వడ్డే విషయంలో దాదాపు ఇలానే జరిగింది. ఆయన నందమూరి ఫ్యామిలీలోని ఒక అమ్మాయిని ప్రేమించారని, దాని వల్లే నవీన్ కి కెరీర్ లేకుండా చేశారని అంటుంటారు. ఇందులో వాస్తవం ఏమిటో తెలియనప్పటికి హీరో నవీన్ వడ్డే కెరిర్ ను పోగొట్టుకున్నాడు. ఆయన కూడా కళ్యాణ్ చక్రవర్తి లాగే సడెన్ గా ఇండస్ట్రీని విడిచి వెళ్లాడు.
వాస్తవాలు ఎంత ఉన్నప్పటికి నందమూరి ఫ్యామిలిలో ప్రేమ వివాహాలు జరగడం ఇష్టం లేదు అనేది తారకరత్న విషయంలో కూడా అర్ధం అవుతుంది. తారకరత్న అలేఖ్య రెడ్డి ప్రేమ, పెళ్లికి నందమూరి ఫ్యామిలీ ఒప్పుకోలేదు. ఆ కారణం వల్ల గొడవలు కూడా అయ్యాయనేది అందరికి తెలిసిన విషయమే.
Also Read: నందమూరి తారకరత్న చివరి కోరిక తీర్చేందుకు సిద్ధపడుతున్న భార్య అలేఖ్య రెడ్డి..