Ads
చాలా మంది సిని పరిశ్రమకి ఏదో ఒక క్రాఫ్ట్ మీద ఉండే ఆసక్తితో వస్తారు. అయితే వారు పరిశ్రమలోకి వచ్చాక ఏం చేస్తారు అనేది మాత్రం ఇండస్ట్రీనే నిర్ణయిస్తుందని చెప్పవచ్చు.
Ads
ఎందుకంటే డైరెక్టర్స్ అవడానికి వచ్చి హీరోలుగా రాణిస్తున్నవారు ఉన్నారు. హీరోలు కావాలని వచ్చి సైడ్ రోల్స్ చేస్తున్నవారు ఉన్నారు. రచయితలుగా వచ్చి నటులుగా స్థిరపడినవారు ఉన్నారు. ఇలా చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే రచయితలుగా కెరీర్ మొదలు పెట్టి నటులుగా మారినవారు ఎవరో ఇప్పుడు చూద్దాం.. తనికెళ్ళ భరణి:
తనికెళ్ళ భరణి మొదట రైటర్ గా ఇండస్ట్రీకి వచ్చి ఆ తరువాత యాక్టర్ గా మారారు. అలా ఆయన బిజీ నటుడిగా మారారు. ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు.
పోసాని కృష్ణ మురళి:
పోసాని రచయితగా 100కు పైన చిత్రాలు చేశారు. సక్సెస్ ఫుల్ రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కొన్ని చిత్రాలకి దర్శకత్వం కూడా చేశాడు. నాయక్ అనే మూవీతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో ప్రస్తుతం కమెడియన్ గా కొనసాగుతున్నాడు.
ఎం.ఎస్ నారాయణ:
ఈయన కూడా రచయితగా కెరీర్ ను మొదలు పెట్టి, ఆ తరువాత డైరెక్టర్ ఈవీవీ వల్ల కమెడియన్ గా మారారు. టాప్ కమెడియన్ కొనసాగారు. ఇక తాగుబోతు క్యారెక్టర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లా అయ్యారు.
ఎల్బి శ్రీరామ్:
ఎల్బీ శ్రీరామ్ మంచి రచయితగా పరిశ్రమలో గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఇవివి తీసిన చాలా బాగుంది మూవీలో ఆయన నటించిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో అప్పటి నుండి ఆయన కామెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.
Also Read: కట్టప్ప అలియాస్ సత్యరాజ్ కుమార్తె ఎలా ఉందో తెలుసా?