హీరోయిన్ రెజీనా టాలీవుడ్ లో ఎందుకు స్టార్ హీరోయిన్ కాలేకపోయింది..

Ads

హీరోయిన్ రెజినా కసాండ్రా తెలుగు ఆడియెన్స్ కి సూపరిచితమే. ఆమె శివ మనసులో శృతి అనే మూవీ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రెజినా కొద్ది కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలెంటెడ్ హీరోయిన్స్ జాబితాలో రెజీనా పేరు ఉంటుంది.

రెజీనా నటిగానే కాకుండా పబ్లిక్ ఈవెంట్స్ లో హీరోలతో కలిసి యాంకరింగ్ కూడా చేస్తూ ఉంటుంది. రెజీనా టాలీవుడ్ లో కన్నా ముందు కన్నడ, తమిళంలో పలు చిత్రాలలో నటించింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఎంతో టాలెంట్, నటన, అందం ఉన్నప్పటికి రెజీనా స్టార్ డమ్ పొందడంలో మాత్రం విఫలమయ్యిందనే చెప్పవచ్చు.
ఆమె సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శౌర్య, జో అచ్యుతానంద, ఎవరు, షాకిని డాకిని లాంటి చిత్రాలలో నటించింది. ఆమె చివరి సారిగా టాలీవుడ్ లో హీరోయిన్ నివేద థామస్ తో షాకిని డాకిని అనే మూవీలో నటించింది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ని ఆకట్టుకోలేక పోయింది. ఈ సంవత్సరం రెజీనా మరో మూవీతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. రెజినా టాలీవుడ్ తో పాటుగా తమిళ, కన్నడ సినిమాలలో బిజీగా ఉంది. నిజానికి ఆమె సౌత్ లో పలు భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. ఆ మధ్యకాలంలో రెజీనా అమితాబ్ బచ్చన్ తో చేసిన సందడి చేసింది.

ఇక రెజీనా టాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటించక పోవడానికి కూడా కారణాలు ఉన్నట్టు సమాచారం. అది ఏమిటంటే రెజీనాకు టాలీవుడ్ స్టార్ హీరోతో ఎఫైర్ ఉండడం వల్లే ఆమెను టాలీవుడ్ నుండి సైడ్ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది మాత్రమే కాకుండా రెజీనాకు టాలీవుడ్ లో సరి అయిన పీఆర్ లేకపోవడం. ఆమె ఒక  ఇండస్ట్రీలో పరిమితం కాకుండా పలు భాషలపై దృష్టి పెట్టడం వల్ల కూడా ఆమె ఏ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్ గా ఎదగడంలో విఫలం అయ్యిందని అంటున్నారు.

Ads

Also Read: బుల్లితెర నుండి సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన 5 గురు హీరోయిన్లు..

 

View this post on Instagram

 

A post shared by Regina Cassandra (@reginaacassandraa)

Previous articleKabzaa Review: ఉపేంద్ర ”కబ్జా” సినిమా హిట్టా..?, ఫట్టా..?
Next articleరచయితలుగా కెరీర్ మొదలు పెట్టి నటులుగా స్థిరపడిన 4 గురు యాక్టర్స్ వీరే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.