Ads
సినీ పరిశ్రమలో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలు ట్రెండ్ హవా నడుస్తోంది. ఇక టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు అనగానే గుర్తుకు వచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఇటీవల ఆయన తన అన్న అయిన సురేష్ బాబు కొడుకు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు.
అయితే ఈ వెబ్ సిరీస్ వల్ల వెంకటేష్ ఆయన కెరీర్ లో మొదటిసారిగా విమర్శల పాలయ్యారు. అయితే వెంకటేష్ ఇప్పటి వరకు చాలా మంది హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసి విజయాన్ని అందుకున్నారు. అటు వంటి స్టార్ హీరో సీనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక మల్టి స్టారర్ సినిమా చేయాలని భావించారు. అయితే ఆ సినిమా ఏమిటో? ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు చూద్దాం..
Ads
ఆ మూవీని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథతో తీయాలని సిద్ధం చేసుకున్నారంట. ఈ సినిమాలో శాతకర్ణి క్యారెక్టర్ లో ఎన్టీఆర్, శాతకర్ణి కుమారుడు పూలమావి పాత్రలో వెంకటేష్ చేయాలని ఫిక్స్ అయ్యారంట. ఎన్టీఆర్ గారు ఆ స్టోరిని కూడా పూర్తి చేయించారంట. ముఖ్యంగా ఈ సినిమాలో శాతకర్ణి కథతో పాటుగా పూలమావి కథను కలిపి చేయాలని అనుకున్నారంట. ఈ మూవీ కన్నా ముందు ఎన్టీఆర్ శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా వచ్చింది. శాతకర్ణి స్టోరి విని వెంకటేష్ ఎన్టీఆర్ తో సినిమాకి ఒకే అన్నారంట. అయితే స్టోరి సిద్ధం అయ్యాక ఎన్టీ రామారావు రాజకీయాల కోసం ఎక్కువగా సమయం కేటాయించడంతో ఆ మూవీ ఆగిపోయింది.
ఇక ఇదే స్టోరీతో దర్శకుడు క్రిష్ నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పేరుతోనే సినిమా తెరకెక్కించి విజయాన్ని సాధించాడు. ఇక ఈ సినిమా బాలకృష్ణకి 100వ చిత్రం కావడం విశేషం. అప్పుడు ఎన్టీ రామారావు, హీరో వెంకటేష్ చేయాలని భావించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథలో బాలకృష్ణ నటించారు. వెంకటేష్ కు ఎన్టీఆర్ తో నటించాలనే కోరిక అయితే తీరలేదు. అందువల్లే కలిసుందాం రా సినిమాలో నచ్చావే పాలపిట్ట అనే పాటలో ఎన్టీఆర్ యానిమేషన్ క్యారెక్టర్ తో నటించి అలా ఆయన కోరికను తీర్చుకున్నారంట.
Also Read: ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన ‘నాటు నాటు పాట’ గురించి ఈ విషయాలు తెలుసా?