అనసూయ భరద్వాజ్ ల ప్రేమ కథ మీకు తెలుసా..?

Ads

అనసూయ భరద్వాజ్ ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా చేసి పాపులర్ అయింది. ఈ షో ద్వారానే తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది అనసూయ. ఇలా బుల్లితెర మీద సందడి చేస్తూ సినిమాలోకి కూడా ప్రవేశించింది అనసూయ. వెండి తెర పై వరుస ఆఫర్ల తో ఈ మధ్య బిజీ అయ్యిపోయింది అనసూయ.

పుష్ప సినిమాలో కూడా ఒక చిన్న రోల్ చేసింది. అలానే గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఈమె ఒక చిన్న పాత్ర చేస్తుంది.

Ads

ఒక పక్క సినిమా షూటింగ్స్ ఇంకో పక్క టీవీ షోస్ తో ఈమె ఎప్పుడు బిజీగానే ఉంటోంది. అయితే అనసూయ సినిమాల గురించి షోస్ గురించి మనకి తెలుసు కానీ ఆమె ప్రేమ కథ గురించి మనకి తెలియదు. మరి ఈ స్టార్ యాంకర్ లవ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అనసూయ భరద్వాజ్ లది ప్రేమ వివాహం. వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంటర్ సెకండియర్ లో ఎన్సీసీ క్యాంప్ లో వీళ్ళ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ లవ్ లో పడడం.. పెళ్లి.. ఇలా అన్నీ అనుకున్నట్టుగా జరిగాయి. అయితే అనసూయ కి మొదట ప్రపోజ్ చేసింది భరద్వాజ్ ఏ.

తాను పెళ్లి చేసుకుంటానని అనసూయ కి చెప్తే ఆమె వెంటనే ఒకే చెప్పలేదట. సంవత్సరంనర ఆలోచించి ఆ తర్వాత అనసూయ భరద్వాజ్ కి ఒకే చెప్పింది. 9 ఏళ్ల వీళ్లు ప్రేమ లో ఉన్నారు ఆ తర్వాత 2010లో పెళ్లి చేసుకున్నారు. పెద్దలని ఒప్పించి పెద్దల సమక్షంలోనే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అనసూయ భరద్వాజ్ కి ఇద్దరు పిల్లలు. ఇప్పుడు అనసూయ కుటుంబం ఆనందంగా వున్నారు.

Previous articleఎన్టీ రామారావు, విక్టరీ వెంకటేష్ నటించాలనుకున్న మల్టీస్టారర్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?
Next articleహీరో విక్రమ్ లవ్ స్టోరీ తెలుసా.? తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ నే ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.!