“మా అమ్మగారి తర్వాత అంతగా ఇష్టపడింది మిమ్మల్నే ఏమో..!” అంటూ… ఓయ్ సినిమా “సంధ్య జాగర్లమూడి” కి ఒక అభిమాని లవ్ లెటర్..!

Ads

సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన ఓయ్ సినిమా ఇవాళ మళ్లీ విడుదల అవుతోంది. ఈ సినిమాకి ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. ఉదయ్, సంధ్య అనే ఇద్దరు భిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రేమ కథ ఈ సినిమా. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాని మళ్లీ విడుదల చేస్తున్నారు.

14 సంవత్సరాల తర్వాత సినిమా విడుదల అవుతున్నా కూడా థియేటర్ లో హౌస్ ఫుల్స్ అయిపోయాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పోషించిన సంధ్య జాగర్లమూడి పాత్రకి ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా లవ్ లెటర్ రాశారు.

love letter to oy movie sandhya jagarlamudi from a netizen

బాలు అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఇలా ఒక లెటర్ రాశారు. “ఓయ్ ఆనంద్ రంగా, ఎప్పటినుండో మీకు ఒక లవ్ లెటర్ రాయాలనుకుంటున్నాను… మీకోసం కాదు లెండి, మా(నా)సంధ్యా జాగర్లమూడి గారి కోసం.. మధ్యలో వదిలేయకుండా మెత్తం చదవండి… సుమారు 15 ఏళ్ల క్రితం అప్పుడు నాకు 14 ఏళ్లు… అప్పుడే తనని మొదటిసారి చూసా…మన ఉదయ్ లాగానే ‘నాలో కలిగే లవ్ యట్ ఫస్ట్ సైట్.. నను కదిపే..’.”

love letter to oy movie sandhya jagarlamudi from a netizen

“అదేదో టీనేజ్ లో కలిగే infatuation (ఇన్ఫ్యాచుయేషన్) అనుకున్నాను…కానీ నా వయస్సు తో పాటే సంధ్య జాగర్లమూడి గారి మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది. మా అమ్మ తర్వాత నేను అంత అమితంగా ఇష్టపడిన మహిళ సంధ్యా జాగర్లమూడి గారే అంటే నమ్మరేమో..?. సంధ్య జాగర్లమూడి గారిలో నాకు బాగా ఇష్టమైన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

తను మొక్కలు పట్ల చూపించే ప్రేమ… జమ్మి మెక్కను కూడా ప్రాణం ఉన్న మనిషి(ఉదయ్) కి సమానం గా ట్రీట్ చేస్తుంది..

Ads

తన తెలుగు భాష ప్రావీణ్యం…తన రోజువారీ భాష కూడా మనం మరచిపోయిన తెలుగు పదాలను గుర్తుచేస్తుంది.”

love letter to oy movie sandhya jagarlamudi from a netizen

“క్రమం తప్పకుండా డైరీ రాయడం

ఓల్డ్ ఫ్యాషన్ గా అనిపించినా…తన పద్ధతులు, తన అలవాట్లు లైక్ భోజనం చేసేటప్పుడు కళ్ళకద్దుకోవడం, దేవుడి మీద భక్తి,ఉపవాసం ఉండటం. I like it…i like it alot. (ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్ అలాట్).

మన అందరిలానే పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న ఇష్టం.

ఎంతైన… సంధ్య జాగర్లమూడి మీ బ్రైన్ చైల్డ్ ఏ కదా…సో మీకు నా ప్రేమ.”

love letter to oy movie sandhya jagarlamudi from a netizen

“forever indebted (ఫరెవర్ ఇండెబిటెడ్: ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను)

మీ బాలు.” అని రాశారు. ఇదంతా ఒక ట్వీట్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ALSO READ : ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి.. పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన తెలుగు హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

Previous articleఫ్రిడ్జ్‌ లో గడ్డ కట్టిన ఐస్ ను శుభ్రం చేయడానికి స్క్రూ డ్రైవర్‌ను వాడుతున్నారా?
Next articleఎన్టీ రామారావు, విక్టరీ వెంకటేష్ నటించాలనుకున్న మల్టీస్టారర్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?