Ads
సాధారణంగా వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం లాగానే హిందువులు కొన్ని శకునాలను కూడా నమ్ముతూ ఉంటారు. వాటిని తమ భవిష్యత్తును లేదా మార్పును చెప్పే సంకేతాలుగా నమ్ముతారు. ఇలాంటి వాటిలో మంచి మరియు చెడు శకునాలు ఉంటాయి. చెప్పాలి అంటే బయటకి వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా, ఎవరైనా తుమ్మినా కూడా కాసేపు ఎక్కడికీ వెళ్లకూడదని అంటుంటారు. ఇలా ఎన్నో శకునాలకు సంబంధించిన విశ్వాసాలు ఇంకా ఉన్నాయి.
Ads
కుక్కలు ఏద్చినట్లయితే ఏదో కీడు జరుగుతుందని, గబ్బిలం ఇంట్లోకి వస్తే అరిష్టం అని కొందరు నమ్ముతారు. భర్త చనిపోయిన స్త్రీ ఎదురువస్తే మంచిది కాదని దాన్ని పాటించే వారు ఇప్పటికి ఉన్నారు. అంతే కాకుండా స్త్రీలకు కుడికన్ను అదిరితే చెడు జరుగుతుందని, మగవారికి ఎడమ కన్ను అదిరితే చెడు జరుగుతుందని చెబుతుంటారు. ఇక ఈ విషయన్ని జ్యోతిష్య నిపుణులు కూడా నమ్ముతారు. మరి స్త్రీ పురుషులలో ఏ కన్ను అదిరితే మంచిదో? ఏ కన్ను అదిరితే చెడు అనేది ఇప్పుడు చూద్దాం..
స్త్రీలకు కన్ను అదిరితే:
మహిళలకు కుడి కన్ను అదిరితే మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. స్త్రీలకు కుడి కన్ను అదరితే అది మంచిది కాదని, చెడుకి సూచన అని ఆ అధ్యయనాలలో తెలుపబడింది. ఇక స్త్రీలకు కుడి కన్ను అదిరితే అనారోగ్య సూచకం అని, ఎడమ కన్ను కొట్టుకున్నట్లయితే మంచిదని చెప్తున్నారు.
పురుషులకు కన్ను అదిరితే:
పురుషులకు కుడి కన్ను అదిరితే వారి చిరకాల కోరిక నెరవేరే సమయం త్వరలో వస్తుందని, వారికి ఏదైనా లక్ కలిసి వస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే డబ్బు రావడానికి సూచనగా కూడా చెప్తారు. ఇక మగవారికి ఎడమ కన్ను అదిరితే చెడు లేదా దురదృష్టం వస్తుందని చెబుతున్నారు. అలాగే ఎడమ కన్ను కొట్టుకోవడం వల్ల ఊహించని సమస్యలు ఎదురవుతాయని నమ్ముతున్నారు.
Also Read: ఆడవాళ్ళు ఎందుకు కాళ్ళకి పట్టీలని పెట్టుకోవాలి..? దాని వెనుక ఇంత పెద్ద కారణమా..?