”విక్టరీ వెంకటేష్” గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇవి..!

Ads

హీరో విక్టరీ వెంకటేష్ తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. దగ్గుబాటి కుటుంబ వారసుడుగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి అనతి కాలం లోనే స్టార్ డమ్ ని పొంది, అగ్రహీరోగా కొనసాగుతున్నారు. వెంకటేష్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. తన కామెడీ తో అందర్నీ బాగా ఆకట్టుకున్నారు.  ముఖ్యంగా వెంకటేష్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని కుటుంబ కథా చిత్రాలతో ఫిదా చేసేసారు.

వెంకటేష్ అమెరికా లో చదువుతున్న సమయం లోనే ఆయన తండ్రి అయిన ప్రొడ్యూసర్ రామా నాయుడు కోరిక మేరకు ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు.

ఆ తరవాత తన క్రేజ్ ని పెంచుకుంటూనే వున్నారు. విక్టరీ వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తారు అలానే తన సెంటిమెంట్ తో అందరినీ ఎమోషనల్ చేసేస్తారు. అలానే పంచ్ డైలాగ్స్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు వెంకటేష్.

Ads

రామానాయుడు, వెంకటేష్, రానా వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి వచ్చారు. వీరంతా కూడా అందరికీ సుపరిచితమే. రానా తెలుగు భాషలోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. అయితే సాధారణంగా హీరో హీరోయిన్ల గురించి ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటుంది కానీ ఎక్కువ మందికి వెంకటేష్ భార్య గురించి తెలియదు.

వెంకటేష్ భార్య పేరు నీరజ. వెంకటేష్ 1985లో నీరజ మెడలో మూడు ముళ్ళు వేశారు. వెంకటేష్ నీరజకి నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా ఒక అబ్బాయి. వెంకటేష్ భార్య నీరజ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. ఇంట్లో వాళ్లకి కావాల్సిన అన్ని పనులు కూడా ఆమే చేస్తారు. వెంకటేష్ ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.

Previous articleఆ కన్ను అదిరితే స్త్రీ, పురుషులలో శుభమా? అశుభమా?
Next articleకొరటాల శివకి పోసాని కి మధ్య సంబంధం ఏమిటి..? అందుకే ఆయన దగ్గర అసిస్టెంట్ గా..?