Ads
ఇప్పుడు ఎన్నో చానల్స్ వచ్చేసాయి. మనం మనకి నచ్చిన ఛానల్ ని చూసేయొచ్చు. పైగా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి. సినిమాలు చూడడానికి కానీ నచ్చిన వెబ్ సిరీస్ ని చూడడానికి కానీ ఏ మాత్రం కష్ట పడక్కర్లేదు ఈజీగా మనం నచ్చిన దానిని ఎంపిక చేసుకుని చూడొచ్చు.
మ్యూజిక్ కి ప్రత్యేకంగా ఛానల్స్ వచ్చేసాయి అలానే కామెడీకి ప్రత్యేకంగా ఛానల్స్ వచ్చేసాయి. ఇలా ప్రతి అంశానికి ఒక్కో ఛానల్ వుంది. కానీ ఇది వరకు చూసుకుంటే కేవలం దూరదర్శన్ మాత్రమే ఉండేది. దూరదర్శన్ అప్పట్లో చాలా మందికి ఎంతో ఇష్టం. ఏం కావాలన్నా దూరదర్శన్ లోనే చూడాల్సి వచ్చేది.
దూరదర్శన్ ఎలా వచ్చింది..?
దూరదర్శన్ మొదట్లో చిన్న ట్రాన్స్మిటర్ స్టూడియో తో మొదలయ్యింది. కానీ తర్వాత ఇండియా లోనే అతిపెద్ద సమాచారం వ్యవస్థగా మారిపోయింది. దూరదర్శన్ ని సెప్టెంబర్ 15, 1959లో ఢిల్లీలో ప్రారంభించారు. కార్యక్రమాలు మాత్రం 1965 నుండి ప్రసారం చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదట ఆల్ ఇండియా రేడియో లో భాగంగా ప్రసారాలు వచ్చేవి తర్వాత రేడియో నుండి విడిపోయి 1972లో ముంబై అమృత్సర్లో వేరు వేరుగా టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టింది.
Ads
దూరదర్శన్ లోగో వివరాలు…
దూరదర్శన్ లోగో అందరికీ గుర్తు ఉండిపోతుంది. లాంగ్ షీట్లో అంతరిక్షం లాగ తరంగాలు తిరుగుతూ తిరుగుతూ ఉన్నట్టు దూరదర్శన్ లోగో లో ఉంటుంది. అలానే చివరికి రెండు కళ్ళు లాగ ఉంటాయి. అంతేకాకుండా కింద సత్యం శివం సుందరం అని రాసి ఉంటుంది ఇలా లోగో ఉంటుంది. నీలం రంగు తెలుపు రంగులలో ఈ లోగో ఉంటుంది.
ఈరోజు ఈ లోగో కి సంబంధించిన విషయాలను చూద్దాం… దూరదర్శన్ లోగో రూపకర్త దేవాశిష్ భట్టాచార్య. దేవాశిష్ భట్టాచార్య మరియు అతని ఫ్రెండ్స్ ఈ లోగో ని డిజైన్ చేసారు. చైనీస్ ఫిలాసఫీ యిన్ అండ్ యాంగ్ సింబల్ లాగ ఇది ఉంటుంది. 1976లో పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ తో పాటుగా ట్యూన్ ని కనుగొన్నారు. డీడీ న్యూస్ తో పాటుగా ఇప్పుడు ఏకంగా 35 ఛానల్స్ వున్నాయి.