”డబ్బులు ఇచ్చి ఆస్కార్ ని కొన్నారు” అంటూ… జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ ఆర్టిస్ట్ ”షాన్ మట్టతిన్” సంచలన కామెంట్లు…!

Ads

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా పేరు, నాటు నాటు పాటే వినపడుతోంది. ఆస్కార్ అవార్డు గురించి ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు. ఓ తెలుగు పాత కి ఆస్కార్ అవార్డు రావడం అంటే అంత ఈజీ విషయమేమి కాదు. నిజంగా ఆస్కార్ అవార్డు రావడం ఎంతో గొప్ప విషయం.

భారతీయ ప్రజలు గర్వపడే విషయము ఇది. ఆర్ఆర్ఆర్ సినిమాకి మ్యూజిక్ అందించిన కీరవాణి కి, పాటకి లిరిక్స్ ఇచ్చిన చంద్రబోస్ కి అవార్డు వచ్చింది. దీనితో ప్రముఖులు, సెలెబ్రెటీలు అభినందనలు తెలుపుతున్నారు.

హాలీవుడ్ సెలబ్రిటీలను సైతం ఈ మూవీ మెప్పించేసింది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఈ సినిమా మీద ప్రశంసల్ని కురిపిస్తున్నారు. మరో పక్క ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఆస్కార్ రావడం తో నెగటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. డబ్బులను ఇచ్చి ఆస్కార్ అవార్డు ని కొన్నారని అంటున్నారు. కానీ ఎవరూ ఈ విషయాలేమి లెక్క చేయడం లేదు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ ఆర్టిస్ట్ చేసిన పోస్టు మాత్రం షాకింగ్ గా వుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్రెండ్ షాన్ మట్టతిన్. ఆమె చేసిన పోస్టు విషయానికి వస్తే…

Ads

”ఇది చాలా ఫన్నీగా వుంది. ఇండియా లోనే ఇప్పటి వరకు అవార్డ్స్ కొనుక్కోచ్చు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆస్కార్స్ లో కూడానా అని పోస్ట్ చేసింది. అలానే డబ్బులు ఉంటే ఆస్కార్ అవార్డును కూడా కొనేయవచ్చు LoL అని అంది. ఇది చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

బాలీవుడ్ లో మాత్రమే అలా కొంటారని కొందరు కామెంట్స్ చేయగా… మీరు యాక్టింగ్ నేర్చుకోండి. ఆ తరువాత అవార్డుల గురించి చూద్దురు అని మరి కొందరు పోస్ట్ చేసారు. ఏది ఏమైనా కూడా ఆర్ఆర్ఆర్ టీం పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అదే చాలు.

 

Previous article”దూర‌ద‌ర్శ‌న్” లోగో అసలు ఇలా వచ్చిందా..? మీకు తెలుసా..?
Next articleఏటీఎం పిన్ కి ఎందుకు ”4” డిజిట్స్ ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?