వెంకటేష్ సుందరకాండ హీరోయిన్ ”అపర్ణ” మీకు గుర్తు ఉన్నారా..? ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే..?

Ads

విక్టరీ వెంకటేష్ ఎన్నో చక్కటి సినిమాలలో నటించి ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. వెంకటేష్ నటించిన సినిమాల్లో సుందరకాండ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. 1992లో ఈ సినిమా వచ్చింది. వెంకటేష్, మీనా, అపర్ణ తదితరులు ఈ సినిమాలో నటించి బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.

లెక్చరర్ ని ప్రేమించిన ఒక అమ్మాయి స్టోరీ ఇది ఇందులో వెంకటేష్ లెక్చరర్ గా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అందుకుంది.

ఈ సినిమాలో ‘ఆకాశాన సూర్యుడుండడు’ అనే పాటని వేటూరి రాశారు ఆ పాటకి నంది అవార్డు కూడా వచ్చింది. నాంచారిగా మీనా, రోజాక అపర్ణ ఈ సినిమాలో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ చిలిపి చేష్టలు చేస్తున్న విద్యార్థిగా నటించి ఆడియన్స్ ని బాగా మెప్పించింది అపర్ణ. ఈ సినిమా తర్వాత అక్క పెత్తనం చెల్లెలు కాపురం సినిమాలో కూడా నటించింది. కానీ తర్వాత ఇంక సినిమాల్లో కనపడలేదు. ఈమె సినిమాలకి దూరంగా ఉంది.

Ads

కొంత మంది హీరోయిన్ల కెరీర్ త్వరగా ముగిసిపోతుంది కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత సిరి ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. అపర్ణ కూడా ఆ సినిమా తర్వాత అలానే చేసింది. అపర్ణ సొంత ఊరు బెంగుళూరు. తెలుగు వారే అయినా బెంగళూరులో స్థిరపడ్డారు. అపర్ణ తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్లు. అపర్ణ చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్ లో ప్రదర్శనలు ఇచ్చేది. ఎన్నో రకాల డాన్స్ లు కూడా ఈమె నేర్చుకుంది.

అపర్ణ ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ కే వీ సత్యనారాయణ ఆమె ఫోటో చూసి సుందరకాండ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చారు. మొదట ఈ సినిమా తమిళ్ లో వచ్చింది. అందులో రోజా పోషించిన పాత్ర ని ఈమెకి చూపించి ఇలా చేయాలని చెప్పగా.. ఆమె ఈ పాత్రని ఎంతో అద్భుతంగా చేసి ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించేసింది.

తర్వాత ఒక సినిమా చేసేసి ఆమె పై చదువుల కోసం బెంగళూరు వెళ్ళింది. తర్వాత అపర్ణ ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2002లో ఎన్నారై తో ఈమె పెళ్లి అయింది ఆమె అమెరికాలోనే ఉంటోంది. అక్కడ తెలుగు వాళ్లతో అమెరికన్స్ నాట్య విద్యను నేర్పిస్తూ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటోంది అపర్ణ.

Previous articleసమంత లాగే ప్రాణాంతక వ్యాధులతో పోరాడి గెలిచిన 5 గురు హీరోయిన్లు..
Next article”దూర‌ద‌ర్శ‌న్” లోగో అసలు ఇలా వచ్చిందా..? మీకు తెలుసా..?